సింహాచలంలో అనీల్ రావిపూడి ప్రత్యేక పూజలు.. #ఎఫ్ 3 స్క్రిప్టు ?

0
400
Anil Ravipudi Visits Simhadri Appanna Temple For F3 script pooja

నందమూరి కళ్యాణ్ రామ్ తో పటాస్ సినిమాని తెరకెక్కించి.. దర్శకుడిగా తొలి సినిమాతోనే కమర్షియల్ సక్సస్ సాధించిన సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో స్వింగ్ లో ఉన్నాడు అనీల్ రావిపూడి. విక్టరీ వెంకటేష్ – మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ఎఫ్ 2 ఇలా వరుసగా విజయాలు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. మహేష్‌ తో సరిలేరు నీకెవ్వరు..సినిమా తీసి బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. బ్లాక్ బస్టర్ `ఎఫ్ 2` సీక్వెల్ డిసెంబర్ రెండవ వారం నుండి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.

కథ రెడీ చేసి ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అయితే… అనిల్ రావిపూడి సడన్ గా సింహాచలంలో ప్రత్యక్షమయ్యారు. ఆయన భార్య, పిల్లలతో కలిసి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. కారణం ఏంటంటే… డిసెంబర్ లోనే ఎఫ్ 3 మూవీని స్టార్ట్ చేయనున్నారు. ఎఫ్ 2 లో ప్రధాన పాత్రలు పోషించిన వెంకటేష్- వరుణ్ తేజ్ సీక్వెల్ లో తమ పాత్రలను తిరిగి పోషించనున్నారు.అందుచేత ఎఫ్‌ 3 స్ర్కిప్ట్ కి సింహాచలంలో ప్రత్యేక పూజలు చేయించారని సమాచారం. ఈ పూజలు అనంతరం అక్కడ మీడియాతో అనిల్ రావిపూడి మాట్లాడుతూ…ఈ నెలలోనే ఎఫ్ 3 మూవీ ప్రారంభం కానుందని తెలియచేసారు.

ఎఫ్ 3 పేరుతో ఈ సీక్వెల్ టాప్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇందులో మూడో హీరో ఎవరు? అన్నది తెలియాల్సి ఉంది. అలాగే కాస్టింగ్ టెక్నీషియన్ల విషయమై మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఎఫ్ 3 మూవీకి కూడా దేవిశ్రీప్రసాదే సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here