బ్లాక్‌బస్టర్ దర్శకుడితో బాలయ్య నెక్ట్స్ సినిమా..?

0
445
Anil Ravipudi Will Direct Nandamuri Balakrishna In His Next Project

Balakrishna Anil Ravipudi: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrisha) హీరోగా కొత్త సినిమాను ప్రకటించడానికి రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని టాక్. బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను (Boyapati Srinu) సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ మొన్నే మొదలైంది. అంతలోనే కరోనా రావడంతో ఆపేసారు. ఎప్పుడు మొదలు పెట్టినా కూడా ఆర్నెళ్లలోనే సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు బోయపాటి.

ఇదిలా ఉంటే తాజాగా మరో సంచలన సినిమాతో రాబోతున్నాడు బాలయ్య. ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ తరవాత అనిల్ రావిపూడి ఇప్పటి వరకు తన రాబోయే సినిమాను ప్రకటించలేదు. త్వరలోనే అనిల్ రావిపూడి ‘F3’ స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తిచేయనున్నారని, ఆ వెంటనే బాలకృష్ణతో సినిమాను ప్రకటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం.

ఇప్పటికే ఓ సారి బాలయ్యతో సినిమా చేయాలని చూసాడు అనిల్. నిజానికి ఆయన 100వ సినిమా కూడా అనిల్ రావిపూడి చేతుల్లో పెట్టాలని చూసాడు నిర్మాత దిల్ రాజు. అప్పట్లో ఈ కాంబినేషన్‌లో రామారావు గారు అనే సినిమా ప్రకటించారు కూడా. కానీ అనుకోని కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. అంతా అనుకున్నట్టే జరిగితే దసరాకి ఈ సినిమాను ప్రకటిస్తారని సమాచారం.

ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నారు. లాక్‌డౌన్‌కు ముందే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఒక ఫైట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేశారు. త్వరలోనే షూటింగ్ తిరిగి ప్రారంభంకానుంది.