Actor Nani Gang Leader Theme Song Ra Ra
Actor Nani Gang Leader Theme Song Ra Ra

[INSERT_ELEMENTOR id=”3574″]

అనిరుథ్ ఎంత స్టఫ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అనే విషయం ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.గతంలో అతను చేసిన సినిమాలు,అందుకున్న హిట్స్ చూస్తే సరిపోతుంది.అతనికి ఉన్న ఈ ట్రాక్ రికార్డ్ చూసే అతన్ని తెలుగులోకి తీసుకువచ్చాడు గురూజీ త్రివిక్రమ్.కానీ ఆ సినిమా డిజాస్టర్ అవ్వడం,పైగా అతని సౌండింగ్ మన వాళ్లకు కనెక్ట్ కాకపోవడంతో అరవింద సమేత కి అతన్ని తీసుకుని కూడా మళ్ళీ పక్కనబెట్టారు.

కానీ జెర్సీ తో అతను తెలుగులో కూడా తొలి హిట్ అందుకున్నాడు.దాంతో నానీ స్వయంగా అతన్ని గ్యాంగ్ లీడర్ కోసం రికమండ్ చేసాడు.దాంతో అతను నానీ కి హిట్ ఇవ్వాలని డిసైడ్ అయినట్టున్నాడు.గ్యాంగ్ లీడర్ నుండి రిలీజ్ అయిన థీమ్ సాంగ్ తోనే ఆ ఆల్బమ్ హిట్ అనే ఫీల్ తెచ్చేసాడు.అనిరుథ్ తమిళ్ లో ఇచ్చిన సాంగ్స్ కి ఉండే హెవీ మెటాలిక్ సౌండింగ్స్ తో ఆ థీమ్ సాంగ్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.గ్యాంగ్ లీడర్ మ్యూజికల్ గా కూడా హిట్ అయితే టాలీవుడ్ లో కూడా అనిరుథ్ టైం స్టార్ట్ అయినట్టే.

[INSERT_ELEMENTOR id=”3574″]

 

Gangleader – Ra Ra (Roar of the Revengers) Telugu Lyric Song –