అంజలి డేరింగ్ స్టెప్ లెస్బియన్‌గా..!

0
334
Anjali Becomes A Lesbian For Netflix Paava Kadhaigal Tamil Film

ఓటీటీ రంగంలో పోటీని ఎదుర్కోవడానికి నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం రీజినల్ కంటెంట్‌పై దృష్టిపెట్టింది. నాలుగు విభిన్న కథలతో తెరకెక్కిన తమిళ వెబ్ సిరీస్ ‘పావ కథైగల్’ డిసెంబర్ 18న నెట్ ఫ్లిక్స్ లో విడుదలవుతోంది. తాజాగా రిలీజైన ట్రైలర్ హాట్ టాపిక్ గా మారింది. ‘పావ కథైగల్’కు నలుగురు ప్రముఖ దర్శకులు దర్శకత్వం వహించారు. సుధ కొంగర, వెట్రిమారన్, గౌతమ్ మీనన్, విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకులు. ఈ నాలుగు కథలు కలిసి ఈ సినిమా. ప్రకాష్ రాజ్, సాయి పల్లవి, అంజలి, సిమ్రన్, గౌతమ్ మీనన్, ఆదిత్య భాస్కర్, భవాని శ్రీ, హరి, కాలిదాస్ జయరాం, కల్కి కొచ్లీన్, పాదం కుమార్, శాంతను భాగ్యరాజ్ లాంటి ప్రముఖ నటులు నటించారు.

ఈ ట్రైలర్‌లో నాలుగు కథలకు సంబంధించిన సన్నివేశాలను చూపించారు. ప్రకాష్ రాజ్, సాయి పల్లవి తండ్రీ కూతుళ్లుగా కనిపించారు. సాయి పల్లవి గర్భవతిగా నటించారు. రెండవ కథ వ్యోమగామి కావాలని కోరుకునే అమ్మాయికి తండ్రి పాత్ర పోషిస్తున్న దర్శకుడు గౌతమ్ మీనన్. గౌతమ్ మీనన్‌కు భార్యగా సిమ్రన్ నటించారు. ఇక విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన మూడో కథలో అంజలి మరో అమ్మాయితో ప్రేమలో పడుతుంది. ఇందులో అంజలి బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ తో ఘాటైన లిప్ లాక్ లు రొమాన్స్ చేయడం యాక్ట్ కి సిద్ధం కావడం ఫ్యాన్స్ కి షాక్ నిచ్చిందనే చెప్పాలి.

విగ్నేష్ శివన్ తెరకెక్కించిన మూడవ కథ.. కల్కి కోచ్లిన్ అనే మహిళతో ప్రేమలో పడే అంజలి గురించి. ఇది లెస్బియన్ కథ.. అంజలి తండ్రి ఈ లెస్బియన్ ప్రేమికుల విషయంలో ఎలా వ్యవహరిస్తాడు అనేది కథాంశం. కులం, పరువుకు ప్రాధాన్యత ఇచ్చే అంజలి తండ్రి ఆమె లెస్బియన్ లవ్‌కు ఓకే చెప్తాడా అనేది ఆసక్తికరం. ఈ లెస్బియన్ లవ్ సీన్స్‌లో అంజలి కాస్త ఘాటుగానే కనిపించింది. ఇక కాళిదాస్ జయరాం, శాంతను భాగ్యరాజ్ నటించిన నాలుగో కథ ముస్లిం అబ్బాయి, హిందు అమ్మాయి మధ్య ప్రేమను తెలియజేస్తుంది. ఇక నటీనటులు ఉద్ధండులే కాబట్టి తెర నిండుగా ప్రతిదీ పండాయనే చెప్పాలి. ట్రైలర్ ఆద్యంతం ఎమోషన్ తో రక్తి కట్టిస్తోంది. ఇలా నాలుగు కథలతో కూడిన ఈ సినిమా ఏ మేర ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

Previous articleవైరల్‌గా మారిన కంగనా ‘తలైవి’ లేటెస్ట్ స్టిల్స్
Next articleసత్యదేవ్‌ ‘తిమ్మరుసు’ ఫస్ట్‌ లుక్ విడుదల