Anjali Geethanjali Malli Vachindhi movie details , Geethanjali 2 shooting update, Geethanjali Malli Vachindhi cast crew, Geethanjali 2 pooja photos, Actress Anjali upcoming movies, Geethanjali 2 movie latest news
Geethanjali Malli Vachindhi Shooting update: టాలీవుడ్ హిస్టరీలో అంజలి నటించిన గీతాంజలి సినిమాను అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు. అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న గీతాంజలి సినిమాకు సీక్వెల్ సిద్ధమైంది. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి 2 అంటూ గీతాంజలి సీక్వెల్ గురించి అనౌన్స్ చేశారు మేకర్స్.
గీతాంజలి మళ్లీ వచ్చింది అనే పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు.
వెన్నులో వణుకు తెప్పించే స్పైన్ చిల్లింగ్ ప్రాజెక్ట్ అంటూ థ్రిల్లింగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు మేకర్స్. గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా షూటింగ్ ఇవాళ్టి నుంచి మొదలైంది. కోన వెంకట్ సగర్వంగా సమర్పిస్తున్న సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. అచ్చ తెలుగు అమ్మాయి అయినా ప్యాన్ ఇండియా రేంజ్‌లో మెప్పిస్తున్న అంజలి నటిస్తున్న 50వ సినిమా ఇది.

ఓ పాడుబడ్డ బంగ్లా ప్రాంగణంలో అటుగా తిరిగి కూర్చుని ఉన్న అమ్మాయితో పోస్టర్ సినిమాపై ఆసక్తి కలిగిస్తూ, ఆకట్టుకుంటోంది. గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ముహూర్తపు సన్నివేశానికి రామచంద్ర క్లాప్‌కొట్టారు. సినిమా స్క్రిప్ట్‌ని ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ సంయుక్తంగా డైరక్టర్ శివ తుర్లపాటికి అందజేశారు.

గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రంలో అంజలి, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్ (డబ్బింగ్ ఆర్టిస్ట్), రాహుల్ మాధవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కథ: కోన వెంకట్, స్క్రీన్ ప్లే: కోన వెంకట్, భాను భోగవరపు, మాటలు: భాను భోగవరపు, నందు శవరిగణ, దర్శకత్వం: శివ తుర్లపాటి, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కెమెరా: సుజాత సిద్ధార్థ్, ఎడిటర్: చోటా కె ప్రసాద్, ఆర్ట్: నార్ని శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నాగు వై, పీ ఆర్ ఓ: వంశీ కాక, పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను.

