ఆర్ఆర్ఆర్ టీజర్ పాతరికార్డులన్నీ చెరిపేసిన తారక్..!

0
506
Another Huge Record For RRR NTR Ramaraju For Bheem Bheem Teaser

RRR NTR Ramaraju For Bheem Bheem Teaser: భారీ అంచనాలతో తెరకెక్కుతున్న జక్కన్న చిత్రం ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందే రికార్డులను క్రియేట్ చేస్తున్నది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్ టీజర్లు యూట్యూబ్లో రికార్డులు నమోదు చేశారు. టాలీవుడ్‌లో మొదటి ఒక మిలియన్ లైక్స్ సాధించిన టీజర్‌గా.. లక్ష కామెంట్లు పొందిన మొదటి టీజర్‌గా ట్రిపుల్ ఆర్ కొమరం భీమ్ టీజర్ నిలిచింది. ఇక వేగంగా 30 మిలియన్ల వ్యూస్ పొందిన టాలీవుడ్ టీజర్‌గా రికార్డు సృష్టించింది. దీంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ తెగ పండుగ చేసుకుంటున్నారు.

అల్లూరి పాత్రలో చరణ్.. కొమ్రం భీం పాత్రలో చరణ్ నటిస్తున్నారు. ఇప్పటికే అల్లూరిగా చరణ్ కనిపించిన టీజర్ భారీ రికార్డులను నమోదు చేసింది. దాని తర్వాత ఎన్టీఆర్ కుమ్రం భీం పాత్రలో కనిపించిన టీజర్ విడుదల కావడంతో పాత రికార్డులను అది చెరిపివేసింది. బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కోసం సినీ ప్రేమికులంతా వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు.

సినిమాలో అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండగా, తారక్ సరసన ఒలీవియా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా నటుడిగా తన ఇమేజ్ను పెంచుకోనున్నాడు. రెండు టీజర్లు సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన ఎన్టీఆర్ టీజర్ తాజాగా మరో రికార్డును తిరగరాసింది.

Previous articleఒక్క హిట్‌తో పెరిగిన సూర్యా మార్కెట్
Next articleకంట్రోల్ చేసుకోమన్న రేణు దేశాయ్..!