శ్రావణి ఆత్మహత్య కేసులో కీలక సాక్ష్యాలు

0
847
another twist in mounaragam serial sravani suicide case

tv actress sravani: Sravani Suicide Case: టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసు దర్యాప్తులో కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ప్రియుడు దేవరాజ్‌ని అదుపులోకి తీసుకోగా.. అతని నుంచి కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. విచారణలో సాయికృష్ణా రెడ్డిపై దేవరాజ్ సంచలన ఆపణలు చేశారు.మూడు రోజులుగా సాగుతున్న ఈ కేసు దర్యాప్తులో ట్విస్ట్ లమీద ట్విస్టులు బయటపడుతున్నాయి.

సాయి అమ్మాయిలను ట్రాప్ చేస్తాడని.. శ్రావణిని కూడా అలాగే ట్రాప్ చేశాడని ఆరోపించాడు. దేవరాజ్ స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు.. శ్రీకన్య హోటల్ లో శ్రావణి-దేవరాజ్ భోజనం చేసిన సీసీ ఫుటేజ్ ను కలెక్ట్ చేశారు. అదే రోజు సాయి కృష్ణారెడ్డి.. శ్రావణిపై దాడి చేసినట్లు దేవరాజు పోలీసులకు తెలిపాడు. హోటల్‌లో గొడవ జరిగిన రోజే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

సీసీ ఫుటేజ్ లో దేవరాజ్ పై దాడి, శ్రావణిపై చేయి చేసుకున్న వ్యవహారం స్పష్టంగా ఉంది. అంతేకాదు ఆర్ ఎక్స్ 100 సినీ నిర్మాత అశోక్ రెడ్డి తో సహజీవనం కోసం సాయి శ్రావణిని విపరీతంగా వేధించినట్లు తెలిసింది. అడ్డుగా ఉన్న దేవరాజ్‌ను తొలగించుకోనేందుకు సాయి.. ప్లాన్ చేశాడని దేవరాజ్ ఆరోపిస్తున్నారు. ఇక ఈ కేసులో కీలకంగా ఉన్న సాయి.. నిర్మాత అశోక్ రెడ్డి ని కూడా విచారిస్తే అసలు సూత్రధారులు ఎవరన్నది తేలనుంది.

రేపు ఎస్ ఆర్ నగర్ పోలీసుల ముందు విచారణకు హాజరుకానున్నాడు సాయి. సాయి కృష్ణ , దేవ్ రాజ్ లు ఒకరి పై ఒకరు ఆరోపణలు చేస్కుంటున్నా నేపధ్యంలో ఇద్దరినీ ఎదురుగా కూర్చోబెట్టి విచారించనున్నారు పోలీసులు. వీరిద్దరితో పాటు ఆర్ ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి కూడా విచారణకు హాజరుకానున్నారు.

Previous articleసుశాంత్ సింగ్ – రియా కలిసి గాంజాయి వైరల్ అవుతున్న వీడియో
Next article‘రైడర్’ ఫ‌స్ట్ లుక్‌: యాక్షన్ లుక్‌లో నిఖిల్ గౌడ