అంటే.. సుందరానికీ సెకండ్ సింగిల్ ‘ఎంత చిత్రం’ విడుదల..!!

నేచురల్ స్టార్ నాని రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికీ’ ఫస్ట్ సింగిల్ పంచెకట్టు పాటకు అన్ని వర్గాలా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండవ సింగిల్ ”ఎంత చిత్రం” పాటని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ పాట మ్యూజిక్ లవర్స్ ని సర్ ప్రైజ్ చేసింది. వివేక్ సాగర్ ఈ పాట కోసం వినసొంపైన మెలోడీని కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం చక్కగా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వుంది. అనురాగ్ కులకర్ణి, కీర్తనా వైద్యనాథన్‌ ఆలాపించిన ఈ పాట మరో చార్ట్ బస్టర్ కావడం పక్కా అనిపిస్తుంది. లిరికల్ వీడియోలో నాని, నజ్రియా నజీమ్‌లా కెమిస్ట్రీ లవ్లీగా వుంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ కు భారీ స్పందన వచ్చింది. సందరం పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి అలరించారు నాని. ఈ చిత్రంలో నాని సుందర్ అనే బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో నటిస్తుండగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి లీలాగా కనిపించనున్న సంగతి తెలిసిందే.

Entha Chithram Lyrical Video From Nani Ante Sundaraniki Released
Entha Chithram Lyrical Video From Nani Ante Sundaraniki Released

ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్‌గా నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ పని చేస్తున్నారు. ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి ‘అడాడే సుందరా’ అనే టైటిల్‌ని పెట్టగా, మలయాళ వెర్షన్‌కి ‘ఆహా సుందరా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జూన్ 10న మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

 

Related Articles

Telugu Articles

Movie Articles