Homeసినిమా వార్తలుజోజు జార్జ్ & కల్యాణి ప్రియదర్శిని ''అంథోని" టీజర్ విడుదల !!!

జోజు జార్జ్ & కల్యాణి ప్రియదర్శిని ”అంథోని” టీజర్ విడుదల !!!

Antony movie teaser released, Joju George and Kalyani Priyadarsan starring Antony movie teaser, Antony movie release date, Antony teaser public talk

ఎయిన్స్టిన్ మీడియా, నెస్ట్లల్ స్టూడియో & అల్ట్రా మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై జోజు జార్జ్, కల్యాణి ప్రియదర్శన్ , చంబన్ వినోద్ జోష్, నైలా ఉష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అంథోని (Antony). ఈ సినిమాకు జోషి దర్శకుడు, ఎయిన్స్టిన్ జాక్ పాల్ నిర్మాత. సుశీల్ కుమార్ అగర్వాల్, నితిన్ కుమార్, రజత్ అగర్వాల్ సహా నిర్మాతలు.

బ్లాడ్ రిలేషన్స్ తో కూడిన ఎమోషన్స్ జర్నీ అంథోని. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి ఆదరణ లభించింది. అంథోని సినిమా ప్రపంచవ్యాప్తంగా మలయాళం, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో నవంబర్ 23న విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని మొదలుపెట్టారు.. ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని (Antony Teaser) ఈరోజు విడుదల చేయడం జరిగింది.

ఈ సందర్భంగా హీరో జోజు జార్జ్ మాట్లాడుతూ… ” గతంలో నేను ఈ చిత్ర దర్శకుడు జోషి దర్శకత్వంలో వచ్చిన పోరింజు మరియం జోష్ నటుడిగా నాకు మంచి గుర్తింపు తెచ్చింది. అంథోని సినిమా కూడా అదే తరహాలో విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను” అన్నారు.

ఈ సినిమాకు జెక్స్ బీజాయ్ సంగీతం అందించగా రెనాడివ్ సినిమాటోగ్రఫీ అందించారు, అలాగే శ్యామ్ శశిధరన్ ఎడిటర్ గా వ్యాహరించిన ఈ సినిమాకు ఆర్జె శాన్ క్రియేటివ్ హెడ్ గా ఉన్నారు అలాగే మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ సంగీత జనచంద్రన్.