Anupama Parameswaran: ప్రేమించాను.. కానీ బ్రేకప్‌ అయ్యింది

0
25
anupama parameswaran open up about her love and break up

Anupama Parameswaran love: మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అందం అభినయం అన్నీ ఉన్నా కూడా ఎందుకో కెరీర్ ను మలుపుతిప్పే హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తూనే ఉంది. ఈమె అభిమానులను ఆకట్టుకోవడానికి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గానే ఉంటుంది.

అనుపమ (Anupama Parameswaran) తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజనులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఇందులో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్తూ వారిని అలరించింది.

ఈ ప్రశ్నలలో ఒక నెటిజన్ అనుపమ ప్రేమ గురించి అడుగగా, ఆమె నేను కూడా ఒకరిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానని అయితే కొన్ని అనుకోని కారణాల వలన మేమిద్దరం విడిపోయామని దుఃఖాన్ని వ్యక్తపరిచింది. అయితే ఆ వ్యక్తి ఎవరన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు.

anupama parameswaran open up about her love and breakup

గతంలో క్రికెటర్‌ బుమ్రాతో అనుపమ (Anupama Parameswaran) ప్రేమాయణంలో ఉందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బుమ్రా వివాహానికి కొద్ది రోజుల ముందే ఇది హాట్‌టాపిక్‌గా మారింది. అయితే అనూహ్యాంగా బుమ్రా టీవీ యాంకర్‌ సంజనను పెళ్లాడటం, ఆ తర్వాత అనుపమ స్యాడ్‌ సాంగ్స్‌తో వీడియోలు చేయడం అప్పట్లో నెట్టింట హల్‌చల్‌ చేశాయి. ఇప్పుడు అనుపమ బ్రేకప్‌ విషయం బయటపెట్టడంతో మరోసారి బుమ్రా పేరు తెరపైకి వచ్చింది.