Anupama Parameswaran to work in Nikhil 18 pages film here are the details

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ మలయాళ ‘ప్రేమమ్’ సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. యంగ్ హీరో నిఖిల్ (Nikhil) ప్రస్తుతం నటిస్తున్న సినిమా 18 పేజీస్‌. కుమారి 21 ఎఫ్ సినిమా తెరకెక్కించిన దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఇందులో హీరోయిన్ పాత్రకు తాజాగా అనుపమను ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ ప్రేమ కథా చిత్రంలో హీరోయిన్ పాత్రకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందట. అందుకే, అనుపమను తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్ కు మెమరీ లాస్ సమస్య ఉంటుంది అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నాడు.

హ్యాపీ డేస్ సినిమాతో అడుగుపెట్టి తనదైన నటన తో వరుసగా సినిమాలు చేస్తన్నాడు నిఖిల్ . హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు ఈ యాంగ్ హీరో. ఇప్పటికే ఈ సినిమా తర్వాత ఎల్ఎల్‌పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్‌) బ్యానర్‌ లో మరో సినిమా అనౌన్స్ చేసాడు.