చిత్రం : ‘నిశ్శబ్దం’ (Anushka Nishabdham Movie OTT Review)
రేటింగ్: 2/5
నటీనటులు: అనుష్క-మాధవన్-మైకేల్ మ్యాడ్సన్-అంజలి-సుబ్బరాజు-షాలిని పాండే-అవసరాల శ్రీనివాస్ తదితరులు
సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: శనీల్ డియో
స్క్రీన్ ప్లే-మాటలు: కోన వెంకట్
నిర్మాత: విశ్వప్రసాద్
కథ-దర్శకత్వం: హేమంత్ మధుకర్
స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ రోజు అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల అయింది. ఆసక్తికర కాంబినేషన్లో తెరకెక్కి వైవిధ్యమైన ప్రోమోలతో ఆకర్షించిన ఈ చిత్రం.. అంచనాల్ని ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
కథ:
అనుష్క (సాక్షి), సోనాలి (షాలిని పాండే) ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అనుష్క తండ్రి నడిపిన ఆర్ఫాన్ స్కూల్ లోనే ఇద్దరు కలిసి పెరుగుతారు. ఇద్దరూ ఒకర్ని ఒకరు వదిలి ఉండలేరు. వీళ్ల మధ్య పరిచయం ప్రేమగానూ మారుతుంది. అయితే ఈ క్రమంలో సాక్షి జీవితంలోకి ఆంటోనీ (మాధవన్) రావడం సోనాలి తట్టుకోలేకపోతోంది. సాక్షితో నిశ్చితార్థం కూడా చేసుకుని పెళ్లికి కూడా సిద్ధమైన ఆంథోనీ.. తను వేయాలనుకున్న ఒక ఆర్టుకు సంబంధించిన మెటీరియల్ కోసమని ఎన్నో ఏళ్ల కిందట ఓ జంట అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఓ భవంతికి తీసుకెళ్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం సోనాలి మిస్ అవ్వడం, అలాగే ఆంటోనీని ఎవరో దారుణంగా హత్య చేయడం లాంటి సంఘటనలు జరుగుతాయి. సాక్షి తీవ్ర గాయాలతో బయటికొస్తుంది. మరి ఆంథోనీని చంపిందెవరు అన్న కోణంలో విచారణ మొదలవుతుంది. ఈ మిస్టరీ ఎలా వీడిందన్నదే మిగతా కథ.
విశ్లేషణ:
డిఫరెంట్ కాన్సెప్ట్ తో హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో మెయిన్ సీక్వెన్స్ లో ప్లే ఇంట్రస్టింగ్ గా సాగుతూ ఆకట్టుకుంటుంది. ఇక అనుష్క, సాక్షి పాత్రలో అద్భుతంగా నటించింది. అప్పుడెప్పుడో వచ్చిన ‘ఎర్రగులాబీలు’.. దాన్నే కొంచెం మోడర్నైజ్ చేసిన తీసిన ‘మన్మథ’ సినిమాల్లో హీరో పాత్రను తీసుకుని దాన్ని విలన్ గా మార్చి.. అదే కథను రివర్సులో చెబుతూ రివెంజ్ పార్ట్ కథానాయిక కోణంలోకి మారిస్తే అదే.. నిశ్శబ్దం. సాక్షికి వినబడదు, కనబడదు, అలాంటి పాత్రను చాలెంజింగ్ గా తీసుకుని మరీ అనుష్క ఈ పాత్రలో నటించిన విధానం మెచ్చుకోతగినది.
మాధవన్ – అనుష్క మధ్య కెమిస్ట్రీ మరియు అనుష్క క్యారెక్టర్ లోని షేడ్స్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఇక సినిమాలో కీలకమైన మేల్ లీడ్ గా నటించిన మాధవన్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఒక అంతుబట్టని మర్డర్ కేసును ఇన్వెస్టిగేట్ చేపే క్రమంలో ఆ హత్య జరిగిన చోటుకు పెద్ద స్థాయిలో బలగాన్ని తీసుకుని వెళ్తారు పోలీసులు. ఎక్కడలేని బిల్డప్ తో మొదలయ్యే ఆరంభ సన్నివేశం చూశాక ఒక గ్రిప్పింగ్ హార్రర్ థ్రిల్లర్ ఏదో చూడబోతున్నామని ఆశలు రేకెత్తిస్తుంది ‘నిశ్శబ్దం’. కానీ అవి నీరుగారిపోవడానికి ఎంతో సమయం పట్టదు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా రంగంలోకి దిగిన అంజలితో రన్నింగ్ కామెంట్రీ ఇస్తున్నట్లుగా వాయిస్ ఓవర్ ఇచ్చినపుడే ‘నిశ్శబ్దం’ ఎలా సాగబోతోందో సంకేతాలు అందుతాయి. ఫ్లాష్ బ్యాక్ చివర్లో కథ మలుపు తిరిగే దగ్గర మళ్లీ కొంచెం ఆసక్తి పుడుతుంది.
సినిమాలో మెయిన్ పాయింట్ అండ్ ప్లే బాగా ఆకట్టుకున్నా… మధ్యలో కొన్ని సీన్స్ మాత్రం బోర్ గా సాగుతాయి. అలాగే క్యారెక్టర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూస్ ను ఎలివేట్ చేస్తూ దర్శకుడు అనుకున్న సీన్స్ లో కొన్ని చోట్ల ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ కలుగుతుంది. పైగా మెయిన్ ప్లాట్ లోనే ఇంట్రస్ట్ మిస్ అవ్వడంతో పాటు పోలీసుల ట్రాక్ లో లాజిక్ మిస్ అవ్వడం లాంటి అంశాలు మరీ సినిమాటిక్ గా సాగుతాయి. అసలేం జరిగి ఉంటుంది అనే ప్రశ్న కొంతసేపు ఉత్కంఠ రేకెత్తిస్తుంది. కానీ అసలు విషయం తెలిశాక ఈమాత్రం దానికే ‘నిశ్శబ్దం’ టీం ఇంత బిల్డప్ ఇచ్చిందనే ఫీలింగ్ కలుగుతుంది.
పైగా కొన్ని లీడ్ సీన్స్ అన్ని కన్ ఫ్యూజ్డ్ గా సాగడం, రిలీఫ్ కి కూడా ఎలాంటి కామెడీ లేకపోవడంతో సినిమా కొంతవరకు నిరాశ పరుస్తోంది. ఇక అనుష్క – షాలిని పాత్రల మధ్య ఎమోషనల్ బాండింగ్ ను బాగానే ఎలివేట్ చేసినా.. షాలిని క్యారెక్టరైజేషన్ ను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాలో మెయిన్ రివేంజ్ డ్రామాకి మోటివ్ ఇంకా బెటర్ గా ఉండేది. ఇలాంటి సినిమాను అనుష్క.. మాధవన్.. మైకేల్ మ్యాడ్సన్ ఏం నచ్చి చేశారు అనే అతి పెద్ద సందేహం అప్పటికి వేధిస్తూ ఉంటుంది.
సాంకేతిక వర్గం:
సినిమాటోగ్రఫీ ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ముఖ్యంగా హారర్ సన్నివేశాల్లో సీన్ లోని మూడ్ ని తన కెమెరా యాంగిల్స్ తో కళ్ళకు కట్టినట్టు చూపించారు కెమెరామెన్. గోపీసుందర్ ట్యూన్ చేసిన మూడు పాటల్లో మొదటిది వినసొంపుగా ఉంది. కానీ సినిమాలో పాటలు అనవసరం అనిపిస్తుంది. శనీల్ డియో ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. విజువల్స్ రిచ్ గా అనిపిస్తాయి. నిర్మాణ విలువల విషయంలో వంక పెట్టడానికి ఏమీ లేదు.
ఇక దర్శకుడు హేమంత్ మంచి కథను తీసుకున్నారు. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఆయన సినిమా తీసి ఉంటే ఈ సినిమా కమర్షియల్ గా కూడా మరో స్థాయిలో ఉండేది. ప్రధాన పాత్రలు ‘ఫలానా’ అని చెప్పుకోవడానికి గొప్పగా అనిపించడం తప్ప.. వాటిని తీర్చిదిద్దిన విధానంలో ఏ ప్రత్యేకతా లేకపోయింది.
చివరగా: స్లోగా సాగే హారర్ థ్రిల్లర్ !