Anushka Sharma Announced About Her Pregnancy And Shared Her Latest Photo

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ భామ అనుష్క శర్మ సినీ, క్రీడాభిమానులు గుడ్ న్యూస్ చెప్పారు. ఇన్నాళ్లుగా తాను ప్రెగ్నెంట్ అని వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ అసలు మ్యాటర్ మ్యాటర్ చెప్పేసింది అనుష్క. 2021 జనవరిలో ముగ్గురం అవుతాం అని కామెంట్ పెట్టారు. ఆ ఫొటోలో అనుష్క శర్మ గర్భవతి అన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది.

జనవరిలో డెలివరీ ఉంటుందన్న నేపథ్యంలో అనుష్క శర్మ ఇప్పటికే 4 నెలల గర్భవతి అని తెలుస్తుంది. మరి ఈ జంట ఇన్నాళ్లు ఈ విషయం ఎందుకు దాచారో అర్థం కావడం లేదు. మరోవైపు ఇదే ఫొటో, ఇదే సందేశాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు విరాట్. దీంతో ఈ శుభవార్త విని సినీ, క్రీడాభిమానులు విరాట్, అనుష్కలకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బుల్లి విరాట్ వస్తాడా? లేక జూనియర్ అనుష్క శర్మ రాబోతోందా అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Anushka Sharma Announced About Her Pregnancy And Shared Her Photo

మూడేళ్లు ప్రేమప్రయాణం చేసిన ఈ జంట 2017లో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్ళై మూడేళ్లు దాటిపోతుండగా ఇన్నాళ్లకు పిల్లల్ని ప్లాన్ చేశారు. ఈ జోడీ లాక్‌డౌన్ కారణంగా గత నాలుగు నెలలుగా ఇంట్లోనే గడుపుతున్నారు. అలా భర్త విరాట్ కోహ్లీతో కలిసి సరదాగా సమయం గడుపుతున్న ఈ బ్యూటీ తాజాగా ఈ శుభవార్త చెప్పి తన అభిమానుల్లో నూతనోత్సాహం నింపేసింది.