Anushka Shetty Key Role in Mahesh Sarkaru Vaari paata Movie

Sarkaru Vaari Patta, Anushka Shetty: సూపర్ స్టార్ మహేష్ బాబు.. పరశురామ్ ల కాంబినేషన్ లో రూపొందబోతున్న సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా పూజా కార్యక్రమం శనివారం జరిగింది. ముహూర్తపు సన్నివేశాన్ని హైదరాబాద్ కేపీహెచ్ బీ లోని కాశీవిశ్వనాథ టెంపుల్ తీశారు. మహేష్ బాబు గారాల పట్టి సితార క్లాప్ కొట్టగా, మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ కెమెరా స్విచాన్ చేశారు.

మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. జనవరి మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. మొదటి షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేయగా కరోనా కారణంగా ఆలస్యం అవుతుంది. వచ్చే నెల కాకున్నా జనవరిలో అయినా సర్కారు వారి పాట చిత్రీకరణ మొదలు కాబోతుంది. సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ పాటు మరో హీరోయిన్ కూడా కనిపించబోతుందట.

ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు అనుష్క అంటూ ప్రచారం జరుగుతోంది.. ఓ బ్యాంక్ ఆఫీసర్ గా అనుష్క నటించబోతున్నట్లు సమాచారం. సినిమా వర్గాలు అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. మహేష్ బాబుతో గతంలో ఖలేజా సినిమాలో నటించిన అనుష్క మళ్లీ ఇన్నాళ్ల తర్వాత సర్కారు వారి పాట సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు ఒప్పుకుందని మీడియా వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.