Anushka Shetty Madhavan Nishabdham trailer talk

Anushka Nishabdham Trailer Talk : అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ సినిమా ఇటు తెలుగుతో పాటు తమిళ్‌లో కూడా తెరకెక్కుతోంది. అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో హేమంత్‌ మధుకర్ తెర‌కెక్కించిన చిత్రం నిశ్శ‌బ్ధం. అక్టోబ‌ర్ 2న ఓటీటీలో విడుద‌ల కానున్న చిత్ర ట్రైల‌ర్ కొద్దిసేప‌టి క్రితం విడుద‌ల చేశారు.

‘భాగమతి’ తర్వాత అనుష్క శెట్టి చేస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తెలుగులో ‘నిశ్శబ్ధం’తో తెరకెక్కుతుండగా.. మిగిలిన భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ విడుదల చేయగా.. తాజాగా మరో ట్రైలర్‌ను విడుదల చేసారు.

రానా త‌న ట్విట్ట‌ర్ ద్వారా ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా, ఇందులో సాక్షి అనే దివ్యాంగురాలి పాత్ర‌లో అనుష్క ఆకట్టుకునేలా న‌టించింది. అనుష్క బెస్ట్‌ ఫ్రెండ్ సోనాలి పాత్రలో షాలినిపాండే నటించగా, అనుష్కను ప్రేమించే వ్యక్తిగా మాధవన్‌ నటిస్తున్నారు. ట్రైల‌ర్‌ని ఆస‌క్తిక‌ర అంశాల‌తో క‌ట్ చేశారు. దెయ్య‌ముండే ఇంట్లోకి మాధ‌వ‌న్ ,అనుష్క వెళ్ళ‌డం అక్క‌డ వారికి ఎదుర‌య్యే ప‌రిస్థితులు, సోనాలి క‌డ‌పడ‌కుండా పోవ‌డం ఇలాంటి విష‌యాల‌తో ట్రైల‌ర్ ఆస‌క్తి రేపుతుంది.

చిత్రంలో హీరోయిన్ అంజ‌లి పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ‘నిశ్శబ్దం’ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మాధవన్ వంటి మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఓ పాత్రను పోషించడంతో నిశ్శబ్దంపై అంచనాలు పెరిగాయి. పూర్తిగా అమెరికాలో ఈ షినిమాను పిక్చరైజ్ చేసారు.