Homeసినిమా వార్తలుచెఫ్ అన్విత రవళి శెట్టిగా అనుష్క శెట్టి...ఫస్ట్ లుక్ రిలీజ్..!!

చెఫ్ అన్విత రవళి శెట్టిగా అనుష్క శెట్టి…ఫస్ట్ లుక్ రిలీజ్..!!

Anushka Shetty New Movie First Look Poster: అనుష్క శెట్టి నుండి సినిమా వచ్చి రెండేళ్లు అవుతుండడంతో ఆమె తాజా సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యంగ్ టాలెంట్ నవీన్ పోలిశెట్టి, అందాల తార అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు.

అనుష్క బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ని విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో నటిస్తున్నారు. చెఫ్ అన్వితా రవళి శెట్టి పాత్రలో కనిపిస్తున్న ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియా లో ట్రెండ్ ఆవుతోంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉందీ సినిమా.

ఫస్ట్ లుక్ లో ఆమె కిచెన్ లో డెలిషియస్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నట్లు ఉందీ లుక్. ఫన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ మూవీ కి నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రధన్ మ్యూజిక్ ఇస్తున్నారు. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవరిస్తున్నారు.వచ్చే ఏడాది తెరపైకి రానున్న ఈ మూవీపై ఫిల్మ్ లవర్స్ లో మంచి అంచనాలున్నాయి.

Makers reveal Anushka Shetty’s First look Poster from her next
Makers reveal Anushka Shetty’s First look Poster from her next

 

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY