అమెజాన్ ప్రైమ్‌లో అనుష్క నిశ్శబ్దం..?

0
367
Anushka Shetty nishabdam movie to streme on amazon prime

Anushka Shetty Nishabdham : హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఇపుడు నేరుగా డిజిటల్ రిలీజ్ (amazon prime) చేసేందుకు చిత్రబృందం రెడీ అవుతోంది. స్వీటీ అనుష్క, మాధవన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ చిత్రంలో అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్‌తో సినిమా షూటింగ్స్‌తో పాటు థియేటర్స్ కూడా మూత పడ్డాయి. అయితే ఈ లాక్ డౌన్ తొలగించిన కూడా జనాలు సినిమా థియేటర్స్‌కు వచ్చి సినిమా చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలియదు. నిశ్శబ్దం సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు సినీ నిర్మాతలు రెడీ అయ్యారు. అంతేగాక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన​ రేపు(సెప్టెంబర్‌17) రానుంది.

ప్రస్తుతం చాలా సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి. నాని, సుధీర్ బాబు నటించిన వి ఈనెల 5న అమెజాన్‌ ప్రైమ్‌ లో విడుదలై మంచి టాక్’ను తెచ్చుకుంది. ఇప్పుడు ఇదే బాటలో తెలుగులో చాలా సినిమాలు ఓటీటీలో విడుదలకానున్నాయి. అందులో భాగంగా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం సినిమాకు కూడా డీల్ కుదిరిందని.. ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుందని సమాచారం.

కాగా నిశ్శబ్దం మూవీ స్ట్రీమింగ్‌ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ కొనుగోలు చేసింది. అయితే అక్టోబర్‌ 2న ‘నిశ్శబ్దం’ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల చేస్తారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఓటీటీలో నేరుగా విడుదలవుతున్న తెలుగు సినిమాల్లో రెండో పెద్ద సినిమాగా గుర్తింపు పొందుతుంది.