‘నిశ్శబ్దం’.. రూ. 1.1 కోట్లు కట్టమని లీగల్ నోటీస్..!

0
594
Anushka Shetty Nishabdham Makers Demands Rs 1.1 Cr As Damage Charges

Anushka Shetty: Nishabdham: అనుష్క శెట్టి, మాధవన్, సుబ్బరాజు, షాలిని పాండే, అంజలి ప్రధాన పాత్రలు పోషించిన మిస్టరీ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా చిత్ర యూనిట్ అయితే ‘నిశ్శబ్దం’ను ఇంకా ప్రమోట్ చేస్తూనే ఉంది. తాజాగా ‘నిశ్శబ్దం’ టీమ్ మరియు అమెజాన్ ప్రైమ్ ఓటీటీకి హైదరాబాద్ కి చెందిన ఓ లోకల్ ఛానల్ షాక్ ఇచ్చింది.

ఈ చిత్రానికి ఓటీటీ ఆడియన్స్ మరియు సినీ విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి చిత్ర యూనిట్ ప్రచారం చేస్తూనే వస్తోంది. అయితే ఈ సినిమా విడుదలై వారం రోజులు కూడా కాకముందే ఓ కేబుల్ ఛానల్ ప్రసారం చేసేసిందని సమాచారం. ఈ విషయం నిర్మాతల దృష్టికి వెళ్లింది. ఆ కేబుల్ ఛానల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాతలు.. వారికి లీగల్ నోటీస్ పంపినట్టు సమాచారం.

దీనికి రూ. 1.1 కోట్లు చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. అలానే ఈ సినిమా హక్కులు తీసుకున్న అమెజాన్ ప్రైమ్ కూడా రూ. 30 లక్షల జరిమానా కట్టాలని లోకల్ ఛానల్ కి నోటీసులు పంపింది. ఇది నిజమే అనడానికి దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ న్యూస్ రాసిన ఓ వెబ్ సైట్ లింక్ ను రీట్వీట్ చేయడం ద్వారా ధృవీకరించారు.

Previous articleSree Vishnu’s ‘Raja Raja Chora’ Shoot Resumes
Next article‘మోసగాళ్లు’ నుండి హాట్ బ్యూటీ… ఫస్ట్‌లుక్‌ అదుర్స్