Anushka Open Comments On Casting Couch In Tollywood

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క కాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది. తాను కూడా కెరీర్ ఆరంభంలో అలాంటి అనుభావాలు ఎదుర్కొన్నానని చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ‘మీటూ’ గురించి మాత్రమే కాదు.. ‘కాస్టింగ్ కౌచ్’ గురించి చాలా చర్చ జరుగుతుంది. ఎంతోమంది అమ్మాయిలు బయటికి వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుంటున్నారు.

దీంతో ప్రతి ఇంటర్వ్యూలోనూ హీరోయిన్లకు కాస్టింగ్ కౌచ్‌పై మీ అభిప్రాయం ఏంటనే ప్రశ్న ఎదురవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా స్టార్ హీరోయిన్ అనుష్క దీనిపై స్పందించింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని మాత్రం తను చెప్పడం లేదని క్లారిటీ ఇచ్చింది ఈమె. అంతే కాకుండా మన టాలీవుడ్‌లో ఇది లేదని చెప్పడం లేదు కానీ.. తన వరకు మాత్రం ఎప్పుడూ ఇలాంటివి ఎదుర్కోలేదని చెప్పింది అనుష్క. తాను ముక్కుసూటిగా ఉండటమే కాదు ప్రతీ విషయంలోనూ నిజాయతీగా ఉంటానని.. అందులో తన వరకు కూడా ఎప్పుడూ ఇలాంటి మీటూ విషయాలు కానీ క్యాస్టింగ్ కౌచ్ కానీ రాలేదని చెప్పుకొచ్చింది అనుష్క.

ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ సినిమాలో నటిస్తోంది. తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఇంగ్లీష్‌లో సైలెన్స్ అనే టైటిల్స్ ఫిక్స్ చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించారు. మాధవన్, షాలిని పాండే తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అతిత్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.