Anushka Shetty Reaction On Her Marriage Photo With Prabhas

Prabhas: Anushka: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో మొదటి వరుసలో ఉన్న పేర్లు ప్రభాస్, అనుష్క. వెండితెరపై ఈ జోడీకి ఉన్న క్రేజ్ మరే జోడీకి లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్ర‌భాస్-అనుష్క‌ల బంధం గురించి ఎప్పుడూ ఒక చ‌ర్చ న‌డుస్తూనే ఉంటుంది. తెర‌పై వీళ్లిద్ద‌రూ క‌లిసి న‌టించిన బాహుబ‌లి, మిర్చి సినిమాల ఫ‌లితాల గురించి.. అందులో వాళ్ల కెమిస్ట్రీ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు.

సిల్వర్ స్క్రీన్‌పై వీళ్ళ కెమిస్ట్రీ చూశాక వీరిద్దరి రిలేషన్, పెళ్లిపై చాలా రూమర్స్ బయటకొచ్చాయి. ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రి పెళ్లి అయిపోయి ఉంటే ఈ ఊహాగానాలు ఆగిపోయేవేమో గానీ.. ప్ర‌భాస్‌కు 40 ఏళ్లొచ్చినా, అనుష్క‌కు 38 ఏళ్లు పూర్త‌యినా ఇప్ప‌టిదాకా పెళ్లి ఊసు ఎత్త‌లేదు. ఈ పరిస్థితుల్లో పెళ్లి పీటలపై కూర్చొని చూడచక్కగా కనిపిస్తున్న ప్రభాస్- అనుష్క ఫోటో ఒకటి వైరల్ కావడం, దానిపై అనుష్క రియాక్ట్ కావడం జరిగాయి. అయితే ఇటీవలే ట్విట్టర్‌లోకి అధికారికంగా అడుగుపెట్టిన అనుష్క.. నిన్న మొదటిసారి అభిమానులతో ట్విట్టర్ వేదికగా ముచ్చటించింది.

ఈ సంద‌ర్భంగా మిర్చి సినిమా చిత్రీక‌ర‌ణ సంద‌ర్భంగా ప్ర‌భాస్, అనుష్క పెళ్లి బ‌ట్ట‌ల్లో త‌యారై పీట‌ల‌పై కూర్చున్న ఫొటో ఒక‌టి షేర్ చేస్తూ ఓ అభిమాని దీని గురించి ఏమంటారు అని అనుష్క‌ను ప్ర‌శ్నించాడు. ఐతే ఆ అభిమాని అడిగిన కోణంలో జ‌వాబు ఇవ్వ‌కుండా.. ఒక స‌న్నివేశం చిత్రీక‌ర‌ణ సంద‌ర్భంగా ఇద్ద‌రం మాట్లాడుకుంటుంటే తీసిన క్యాండిడ్ పిక్ అని.. ఇది త‌న మ‌న‌సుకు ద‌గ్గ‌రైన చిత్ర‌మ‌ని.. యువి క్రియేష‌న్స్ వాళ్ల తొలి చిత్రం అ‌ని పేర్కొని.. యువి అధినేత‌లైన‌ వంశీ, ప్ర‌మోద్, విక్కీల పేర్లు ప్ర‌స్తావించి దండం పెట్టే ఎమోజీలు పెట్టింది..