Anushka shetty roped for venkatesh asuran telugu remake movie
Anushka shetty roped for venkatesh asuran telugu remake movie

ఎఫ్2 చిత్రంతో ఈ ఏడాది విక్టరీ వెంకటేష్ ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ వెంకీ మామ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ నటించే తదుపరి చిత్రం గురించి ఇటీవల ఆసక్తికర ప్రకటన వచ్చింది. కోలీవుడ్ లో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాల్లో ధనుష్ ‘అసురన్’ కూడా టాప్ ప్లేస్ దక్కించుకుంది. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత అయిన సురేష్ బాబు ఈ చిత్రం రీమేక్ రైట్స్ ను దక్కించుకున్నారు. తెలుగు రీమేక్ లో వెంకటేష్ నటించబోతున్నాడు. …

ఇక ఈ రీమేక్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారు అనేదాని పై చాలా డిస్కషన్లు జరిగాయి. ఓంకార్, హను రాఘవపూడి పేర్లు వినిపించినప్పటికీ శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయబోతున్నట్టు సురేష్ బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అసురన్ చిత్రంలో ధనుష్ విలక్షణ నటన ప్రదర్శించాడు. ధనుష్ కి జోడిగా మంజు వారియర్ నటించింది. ధనుష్ కన్నా మంజు వారియర్ వయసులో 4 ఏళ్ళు పెద్ద. అయినా కూడా ఆ పాత్రలో ఆమె బాగా ఒదిగిపోయింది.

వెంకటేష్ ‘అసురన్’ తెలుగు రీమేక్ లో ఎవరు నటిస్తారు అనేదాని పై కూడా చాలా వార్తలు వచ్చాయి. వెంకటేష్ తో రెండు సినిమాలు చేసిన శ్రీయ శరన్ హీరోయిన్ గా నటిస్తుందని మొదట వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు వెంకటేష్ కు నటించే హీరోయిన్ విషయంలోఅనుష్క పేరు వినిపిస్తోంది. చిత్ర యూనిట్ అనుష్కతో సంప్రదింపులు జరుపుతున్నారట.

అనుష్క ప్రస్తుతం నిశ్శబ్దం చిత్రంలో నటిస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ.. అనుష్క అయితే ఈ పాత్రకి కరెక్ట్ చాయిస్ అనే చెప్పాలి. ఇక వెంకీ తో అనుష్క గతంలో ‘చింతకాయల రవి’ ‘నాగవల్లి’ వంటి చిత్రాల్లో నటించింది. అసురన్ రిమేక్ లో నటించేది ఖాయమైతే వెంకటేష్ సరసన అనుష్క మూడవసారి నటించబోతున్నట్లు అవుతుంది.