RRR Movie, AM CM Jagan: కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్ల రేట్లు గురించి వివాదం కొనసాగుతూనే ఉంది. పలుమార్లు టాలీవుడ్ కి సంబంధించిన ప్రొడ్యూసర్స్ ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలు మాత్రం పెరగలేదు. దీనిని బట్టి సంప్రదింపులు ఫలించలేదని తెలుస్తోంది.
ఇప్పుడు టాలీవుడ్ కి సంబంధించి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటైన RRR మూవీ జనవరి 7 తారీఖున రిలీజ్ అవుతుంది. కొన్ని రోజుల క్రితం మూవీ ప్రొడ్యూసర్ ఆయన DVV దానయ్య ఈ విషయంలో కోర్టుకు వెళ్తారని సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దానికి సంబంధించి దానయ్య ట్విట్టర్ లో ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు. ఎటువంటి పుకార్లను నమ్మవద్దని మేము జగన్ గారితో సంప్రదింపులు జరుపుతామని వివరించారు. అయితే ఈ సినిమా గాను దానయ్య 450 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాడు. దీంతో థియేట్రికల్ బిజినెస్ 500 కోట్లకి పైగా జరిగితేనే నిర్మాత సేఫ్ అవుతాడు.
దీనిని బట్టి ఆలోచిస్తే ఏపీలో టిక్కెట్ల రేట్లు పెరగకపోతే డిస్ట్రిబ్యూటర్లు అలాగే ప్రొడ్యూసర్లు కూడా బాగా నష్టాలు చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలో టిడిపి పార్టీకి సంబంధించిన NTR అలాగే జనసేన పార్టీకి సంబంధించి Ram Charan వున్నారు.
RRR movie ప్రొడ్యూసర్ చెప్పిన విధంగా ఎప్పుడు చర్చలు జరుగుతున్నాయి అన్న సమాచారం లేదు. మరి చర్చల అనంతరం జగన్ సర్కార్ పోటీగా ఉన్న ఈ రెండు పార్టీలకు సంబంధించిన హీరోస్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా తెలియాల్సి ఉంది. అలాగే సినీ వర్గాల్లో ఈ సినిమాకు సంబంధించిన చర్చ ఆసక్తికరంగా మారింది.
ఈ ఆర్టికల్ కేవలం కల్పితం మాత్రమే. ఎవర్ని ఉద్దేశించి ఈ న్యూస్ ని రాయడం జరగలేదు. సినిమా ఇండస్ట్రీ అటు ప్రభుత్వానికి గాని సంబంధం లేదు. జరుగుతున్న పరిణామాలను బట్టి ఈ ఆర్టికల్ రాయటం జరిగింది.