AP government ban ram gopal varma kama rajyam lo kadapa reddlu movie
AP government ban ram gopal varma kama rajyam lo kadapa reddlu movie

‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను నవంబర్ 29న విడుదల చేయాలని అనుకున్నాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..! అయితే ఆయన అనుకున్నట్లు జరగలేదు. సెన్సార్ జరగకపోవడం.. పలు కేసులు నమోదవ్వడంతో సినిమా విడుదల ఆగిపోయింది. అయితే వర్మ సినిమాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ పై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. టైటిల్ ను మార్చాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారులకు లేఖ రాశారు.

ఇక సినిమా చూసి పరిశీలనార్హమైన అంశాలను తమకు వారంరోజుల్లో తెలపాలని కోర్టు సెన్సార్ బోర్డును ఆదేశించింది. వారం రోజుల్లోగా సినిమాను చూసి అభ్యంతరాను పరిశీలనకు తీసుకోవాలని సెన్సార్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు రామ్ గోపాల్ వర్మ తరపు న్యాయవాది. ఈ సినిమాతో పాటు టైటిల్ పై ఇటీవల కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేశారు. టైటిల్ ను ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’గా మార్చామని సదరు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ సినిమా విడుదలకు టైమ్ పట్టేలా కనిపిస్తోంది.

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రంలో తనను అగౌరవపరిచేలా పాత్రను చిత్రీకరించారని కేఏ పాల్ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే . సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని నిర్మాతలను కోర్టు ఆదేశించగా.. సినిమాకు ఇంకా సెన్సార్ పూర్తి కాలేదని కోర్టుకు నిర్మాతలు తెలిపారు. ఇంటర్వ్యూ లలో కేఏ పాల్ మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మపై తీవ్ర విమర్శలు చేశారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్ రెండు కులాల మధ్య చిచ్చుపెట్టేందుకే పెట్టారని విమర్శించారు. కమ్మ కులస్తులను ‘ఇన్సల్ట్’ చేసి, రెడ్డీస్ ను ‘హైలైట్’ చేసేలా ఓ రెడ్డి కులస్తుడు వర్మకు రూ.5 కోట్లు ఇచ్చారని ఆరోపించారు పాల్. కేవలం, డబ్బు కోసం రెండు కమ్యూనిటీల మధ్య గొడవలు పెట్టేందుకు చూస్తున్నారని.. పిచ్చోళ్లు తప్ప, మంచి వాళ్లెవ్వరూ ఈ సినిమా చూడరని అన్నారు.