Kathi Mahesh: చికిత్స కోసం ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం

0
40
AP government offers 17 Lakh for Kathi Mahesh treatment

Kathi Mahesh: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేశ్ కు ఏపీ ప్రభుత్వం ఆర్థికసాయాన్ని అందించింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.17 లక్షల భారీ అర్థిక సాయం విడుదల చేసింది. ఈ మేరకు అధికారికంగా ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్‌ నుంచి లేఖను విడుదల చేశారు.

గత నెల 26న కారులో వెళ్తున్న మహేశ్ ఎదురుగా వెళ్తున్న లారీని వేగంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయమైంది. కళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం కావడంతో వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు.  ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.