AP High Court On Bigg Boss Telugu 7 Show: గత ఆరు సంవత్సరాలుగా మాటీవీలో నడుస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్. నాగార్జున హోస్ట్ గా ప్రారంభించిన ఈ షో ఇప్పుడు ఏడవ సీజన్ కి చేరుకుంది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ సెప్టెంబర్ 7 నుండి మొదలవుతుందని సమాచారమైతే తెలుస్తుంది అయితే ఈ షో మీద ఏపీ హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనివల్ల బిగ్ బాస్ 7 మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
AP High Court On Bigg Boss Telugu 7 Show: అసలు విషయానికి వెళ్తే, మా టీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో అశ్లీలతను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి హైకోర్టులో కేసు నమోదు చేయగా, ఈ కేసు పై పిటిషనరు వాదించటం జరిగింది, నాగార్జున కి అలాగే బిగ్ బాస్ షో నిర్మాతలకి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఈ నోటీసులకి త్వరగా పంపాలన్నట్టు కూడా హైకోర్టు ఆదేశించింది.

స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మా టీవీ తరపున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. బిగ్ బాస్ షో ప్రసారానికి ముందు సెన్సార్ వ్యవస్థ లేదని, షో చూడకూడదనుకుంటే ఛానెల్ మార్చుకోవచ్చని అన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తీవ్రంగా స్పందించి కార్యక్రమానికి సెన్సార్‌షిప్ అవసరమని తేల్చి చెప్పింది. షో ప్రసారమైన తర్వాత ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఇలా అశ్లీల కార్యక్రమాలను ప్రసారం చేస్తుంటే అన్ని ఛానళ్లపై నిఘా పెట్టకూడదా? అని కోర్టు ప్రశ్నించింది.
తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.దుర్గాప్రసాద్, జస్టిస్ వెంకట జ్యోతిర్మయిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. మరి తీర్పు వచ్చేదాకా బిగ్ బాస్ 7 సీజన్ మొదలవుతుందో లేదో డౌటే అని చెప్పాలి. ఒకవేళ మొదలైన అసభ్యకరంగా జరుగుతున్న కొన్ని సన్నివేశాలని కత్తెర పడే అవకాశాలు ఉంటాయి. మరి ఇంకొన్ని రోజుల్లో సీజన్ సెవెన్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంపై క్లారిటీ రానుంది.