Ap Student Unions Protest Infront Of Hero Mahesh babu
Ap Student Unions Protest Infront Of Hero Mahesh babu

(Ap Student Unions Protest Infront Of Hero Mahesh babu) ఏపీ రాజధాని అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన సెగ టాలీవుడ్ స్టార్స్ ను తాకింది. టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంటి ముందు జై ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి యువజన పోరాట సమితి విద్యార్దులు ధర్నా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని హైదరాబాద్ లోని మహేశ్ బాబు ఇంటిముందు నిరసన తెలుపుతున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ జై ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి యువజన పోరాట సమితి రాహార దీక్ష చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.

విషయం తెలుసుకున్న జూబ్లిహిల్స్ పోలీసులు విద్యార్దులను అరెస్ట్ చేశారు. నేటి నుంచి ఈ నెల 19 వరకు హీరోల ఇంటి ఎదుట ఆందోళన చేస్తామని విద్యార్థులు ప్రకటించారు. రాజధాని తరలింపు విషయంపై మహేశ్ బాబు స్పందించాలని వారు డిమాండ్ చేశారు. అమరావతి అంశంపై సినీ పెద్దలు స్పందించాలని కోరారు. రేపటి నుంచి ప్రతి హీరో ఇంటి వద్ద నిరసనలు తెలియజేస్తామని చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలని, కర్నూల్‌లో హైకోర్టు, అమరావతి, విశాఖలో బెంచీలు ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.