Homeసినిమా వార్తలుపంజా వైష్ణవ్ తేజ్ 'PVT04'లో వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్

పంజా వైష్ణవ్ తేజ్ ‘PVT04’లో వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్

Aparna Das on board for Vaishnav Tej next PVT04 movie, Aparna Das key role in PVT04, Sreeleela lead heroine in PVT04, Vaishnav Tej new movie details

Aparna Das Telugu Debut Movie: ‘PVT04’తో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమవుతున్న ప్రముఖ నటి అపర్ణా దాస్(Aparna Das)… న్జన్ ప్రకాశన్, మనోహరం, బీస్ట్ వంటి సినిమాలతో మలయాళ, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి అపర్ణా దాస్ ‘PVT04’ చిత్రంతో తెలుగు సినీరంగ ప్రవేశానికి సిద్ధమయ్యారు.

ఎంతో ప్రతిభ గల ఈ నటిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తుండటం పట్ల చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ, ఎస్. సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పంజా వైష్ణవ్ తేజ్ (Panja Viashnav Tej), శ్రీలీల (Sreeleela), జోజు జార్జ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

పంజా వైష్ణవ్ తేజ్ (Panja Viashnav Tej) కెరీర్ లో నాలుగో చిత్రంగా రూపొందుతోన్న PVT04 లో అపర్ణా దాస్ వజ్ర కాళేశ్వరి దేవి పాత్రను పోషిస్తున్నారు. సినిమాకి ఎంతో కీలకమైన పాత్రలో నటిస్తున్న అపర్ణ, తన అద్భుతమైన నటనా నైపుణ్యంతో పాత్రకు న్యాయం చేస్తుందని చిత్ర బృందం విశ్వసిస్తోంది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చిత్రబృందం పక్కా ప్రణాళికతో ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. అపర్ణ ఇటీవల తమిళంలో నటించిన దాదా చిత్రం ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Aparna Das Key role in Vaishnav Tej next PVT04 movie

PVT04 త్వరలో థియేటర్లలో అలరించడానికి సిద్ధమవుతోంది. తెలుగు సినీ ప్రేమికులు తప్పక థియేటర్లలో చూసి ఆనందించదగ్గ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న PVT04 కి అపర్ణా దాస్ రాక మరింత ఆకర్షణ అవుతుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.

Web Title: Aparna Das on board for Vaishnav Tej next PVT04 movie, Aparna Das key role in PVT04, Sreeleela lead heroine in PVT04, Vaishnav Tej new movie details

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY