Apsara Rani Will Screen Share With Ravi Teja In Krack

apsara rani : Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ”క్రాక్” సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే హైదరాబాద్ లో తిరిగి ప్రారంభమైన ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ లో శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘థ్రిల్లర్’ మూవీలో అందాలన్నీ ఆరోబోసి హాట్ కిక్కిచ్చిన అప్సరా రాణితో రవితేజ ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేస్తున్నారట.

‘క్రాక్’లో ఐటెం సాంగ్‌లో రవితేజ- అప్సర రాణి రెచ్చిపోయి చిందులేయబోతున్నారు. ఈ విషయాన్ని క్రాక్ యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించడంతో మాస్ మహారాజ్ అభిమానుల్లో ఆతృత మొదలైంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కంపోజ్ చేసిన ఈ మాస్ ఐటెం నెంబర్ కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. జీకే విష్ణు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. తాజాగా రవితేజ – అప్సరా మధ్య షూట్ చేస్తున్న ఈ సాంగ్ కు సంబంధించిన ఓ ఫోటోని డైరెక్టర్ గోపీచంద్ మలినేని ట్విట్టర్ లో షేర్ చేశారు.

Apsara Rani does item song in Ravi Teja Krack movie

ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ రోల్ పోషిస్తుండగా, ఆయన సరసన శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో రవితేజ- గోపీచంద్ మ‌లినేని కాంబోలో వచ్చిన ”డాన్‌ శీను, బలుపు” సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ హ్యాట్రిక్ మూవీ ‘క్రాక్’పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ‘క్రాక్’ ఫస్ట్ లుక్ మరియు టీజర్ విశేష స్పందన తెచ్చుకుంది. సరస్వతి ఫిలిమ్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.