‘గజినీ’ సీక్వెల్ లో అల్లు అర్జున్

0
2
AR Murugadoss planning to Direct Allu arjun in ghajini2

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఒక భారీ బడ్జెట్ సినిమాకి సన్నాహాలు జరుగుతుండగా.. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో సోలోగా నిర్మించడానికి అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. కాగా ఈ సినిమా గతంలో సూర్య నటించిన ‘గజినీ’ సినిమాకు సీక్వెల్ గా రానుందని వినిపిస్తోంది.

 

మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. సూర్య బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఇప్పుడు మురగదాస్ తీయబోయే ఈ సినిమా గజినీకి సీక్వెల్ గా రానుందా లేదా పూర్తిగా కొత్త కథతో రానుందా..? తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే! ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమా చేస్తుండగా.. కరోనా సోకడంతో రెస్ట్ తీసుకుంటున్నాడు.