ముంబై ఇప్పటికే కరోనాకు (Corona) కేంద్రంగా మారిపోయింది. అక్కడ ఎంతమందికి కరోనా వచ్చిందనే జాబితా కూడా చాంతాడంత ఉంది. బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా చాలా మంది.. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ (Arjun Kapoor) ప్రేయసి మలైకా అరోరాకు (malaika Arora) కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ముందు అర్జున్ కపూర్‌కు కరోనా సోకినట్టు తేలిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ హీరోయిన్ మలైకా అరోరాకి కరోనా సోకింది. సోమవారం ఆమె కరోనా టెస్ట్ చేసుకోగా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని మలైకా పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ లక్షణాలేవి లేవని వెల్లడించింది. నేను ప్రస్తుతం బాగానే, ఆరోగ్యంగానే ఉన్నానని తెలియజేస్తున్నా. కరోనాకి సంబంధించి నియమాలను, నిబంధనలను, డాక్టర్ల సూచనల, సలహాలు, అధికార వర్గాలు సూచనలు పాటిస్తూ ఇంట్లోనే హోం క్వారంటైన్లో ఉంటున్నా. వున్నా అని చెపుకువచ్చింది..
అంతకు ముందు అర్జున్ కపూర్ తన ఆరోగ్యానికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ‘‘నాకు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయిన విషయం మీ అందరికీ చెప్పడం నా బాధ్యత. నాకు ఎలాంటి లక్షణాలు లేవు. నేను బాగానే ఉన్నాను. డాక్టర్లు, అధికారుల సూచన మేరకు నేను నా ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నాను. హోం క్వాంటైన్లోనే ఉంటాను. మీ ప్రోత్సాహానికి ముందుగానే కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో నా ఆరోగ్యం గురించి మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాను. గతంలో ఎప్పుడూ చూడని కఠిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మానవాళి ఈ వైరస్‌ను అధిగమిస్తుందని నాకు నమ్మకం ఉంది. ప్రేమతో, మీ అర్జున్’’ అని అర్జున్ కపూర్ పేర్కొన్నారు.