ఖిలాడిలో విలన్ పాత్ర వెయ్యబోతున్నఅర్జున్ సార్జా

0
89
arjun-sarja-to-play-vilan-role-in-raviteja-khiladi-movie
arjun-sarja-to-play-vilan-role-in-raviteja-khiladi-movie

మాస్ మహరాజ రవితేజ క్రాక్ సినిమాతో పూర్తి ఇండస్ట్రీని షేక్ చేశారు. క్రాక్ బ్లాక్ బస్టర్ కావడంతో రవితేజ ఫేమ్ ఆకాన్నంటింది. భారీ హిట్ కొట్టిన ఉత్సాహంతో సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. అతడు తాజాగా చేస్తున్నసినిమా ఖిలాడి. ఈ సినిమా సురేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుంది.

 

 

ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా ఓ కీలక పాత్రలో నటించనున్నారంట. ఈ విషయాన్ని అర్జున్ స్వయంగా ప్రకటించారు. ఖిలాడీ సెట్స్‌లో అడుగుపెడుతున్నానంటూ ఓ లుక్‌ రివీల్ చేశారు. కాకపోతే ఈ సినిమాలో అర్జున్ విలన్ పాత్రలో కనిపించనున్నారా అని సందేహాలు వస్తున్నాయి. వీటికి సమాధానం కోసం కొంత కాలం వేచి చూడాల్సిందే.