Homeసినిమా వార్తలుఏడు సంవత్సరాల తర్వాత విలన్ గా అరవింద్ స్వామి..బ్రేక్ వస్తుందా?

ఏడు సంవత్సరాల తర్వాత విలన్ గా అరవింద్ స్వామి..బ్రేక్ వస్తుందా?

నాగచైతన్య (Naga Chaitanya) అలాగే వెంకట ప్రభువు దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ కస్టడీ. ఈ సినిమాని మే 12న విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్. కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో అరవింద స్వామి (Aravind Swamy) విలన్ గా చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రైలరు సినిమాపై భారీ అంచనాలను ఏర్పడేటట్టు చేశాయి. వరుస ఫ్లాపులతో ఉన్న అక్కినేని ఫ్యామిలీ కస్టడీ మూవీతో బ్రేక్ రావాలని ఫాన్స్ అలాగే మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.

రామ్ చరణ్ (Ram Charan) నటించిన ధ్రువ సినిమాతో స్టైలిష్ విలన్ అని పేరు తెచ్చుకున్న అరవింద స్వామి (Aravind Swamy) ఆ తర్వాత ఎటువంటి సినిమాలు చేయలేదు. మళ్లీ అరవింద్ స్వామి నాగచైతన్య కస్టడీ సినిమాలో మళ్లీ విలన్ గా కనబడుతున్నారు. ధ్రువ సినిమా తర్వాత అరవింద స్వామికి చాలా ఆఫర్లు వచ్చాయి టాలీవుడ్ నుండి. అన్నిటికీ నో చెప్పి 7 సంవత్సరాల తర్వాత మళ్లీ విలన్ గా తెలుగు సినిమా స్క్రీన్ మీద కనబడుతున్నాడు అరవింద్ స్వామి(Aravind Swamy). ఈ సినిమాలో అరవిందస్వామి క్యారెక్టర్ చాలా క్రోరంగా ఉంటుందని సినిమా వర్గాలు చెబుతున్నారు..

హీరోగా సినిమాలు మొదలుపెట్టిన అరవింద్ స్వామి (Aravind Swamy) విలన్ పాత్రలకు చాలానే దూరంగా ఉంటారు. అలాంటిది ఈసారి ధ్రువ తర్వాత మళ్లీ విలన్ గా ఈ సినిమాలో చేస్తున్నారు. కస్టడీ సినిమా తర్వాత టాలీవుడ్ లో అరవింద్ స్వామి ఫేట్ మారుతుందని అలాగే మరికొన్ని సినిమాలు టాలీవుడ్ లో తనకు వస్తాయని నాగచైతన్య మూవీ కి సంబంధించిన వారు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగులో కూడా ప్రతినాయక పాత్రలకి మంది ప్రాధాన్యత ఉంటుంది. స్టార్ యాక్టర్స్ ఆ పాత్రలని చేసేందుకు ముందుకొస్తున్నారు.

Arvind Swamy role revealed in Custody movie

ఈ నేపధ్యంలో టాలీవుడ్ దర్శకులు ఇంటరెస్టింగ్ విలనిజంతో అరవింద్ స్వామి (Aravind Swamy) కోసం ప్రత్యేకమైన పాత్రలు సృష్టిస్తారేమో చూడాలి. ఇక కస్టడీ సినిమా విషయానికి వస్తే దర్శకుడు వెంకట ప్రభువు అలాగే నాగ చైతన్య నిన్న జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా ఎలా ఉండబోతుందో అందరికీ తెలియజేశారు. మొదటి 20 నిమిషాలు మామూలుగా నడుస్తుందని ప్రీ ఇంటర్వెల్ ముందల నుంచి యాక్షన్ సన్నివేశాలు మొదలవుతాయని ఆ తర్వాత వేరే రేంజ్ లో ఉంటుందని ఇద్దరు చెప్పడం జరిగింది. నాగచైతన్య ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. మరి ఇంకొన్ని రోజుల్లో సినిమా ఎలా ఉండబోతుందో అలాగే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుందో లేదో తెలుస్తుంది.

Web Title: Arvind Swamy role revealed in Custody movie.. Arvind Swamy new movie details, Arvind Swamy upcoming movies, Naga Chaitanya and Krithi Shetty Custody movie

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY