ఆర్య ‘ఎనిమి’ సినిమా ఫస్ట్ లుక్

0
393
arya-first-look-from-enemy-released
arya-first-look-from-enemy-released

తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమాల్లో ఎనిమి కూడా ఒకటి. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరోలు విశాల్, ఆర్యలు నటిస్తున్నారు. విశార్ హీరో పాత్రలో చేస్తుండగా, ఆర్య విలన్‌గా కనబడనున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు మంచి స్పందన అందుకున్నా వాటిలో ఎక్కడా ఆర్య కనిపించలేదు. అయితే నేడు తాజాగా ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి మరో ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.

 

 

ఈసారి విడుదల చేసింది ఆర్య ఫస్ట్ లుక్. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫస్ట్‌లుక్‌ బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. చేతికి సంకెళ్ళు వేసుకొని దెబ్బలతో ఆర్య కనిపిస్తున్నాడు. ఎదో ఫైటింగ్ సీన్‌లా ఈ ఫస్ట్ లుక్ ఉంది. ఈ ఫోటో సినిమాపై ఉన్న అంచనాలను మరింత రెట్టింపు చేశాయి. ప్రస్తుతం అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.