పుష్పలో తమిళ్ స్టార్ నటుడు ?

696
పుష్పలో తమిళ్ స్టార్ నటుడు ?
పుష్పలో తమిళ్ స్టార్ నటుడు ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా రేంజ్ సినిమా పుష్ప. ఈ సినిమా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌ పాత్ర చాలా కీలకంగా ఉండనుంది. అందులో మొదట తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతిని ఓకే చేశారు. కానీ కరోనా కారణంగా అన్ని డేట్స్ క్లాష్ కావడంతో ఈ సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నాడు. దాంతో ఆ పాత్రలో ఎవరైతే బాగుంటాడని చర్చలు మొదలు పెట్టారు.

 

 

అయితే ఇటీవల ఆ పాత్రకు కావలసిన నటుడు దొరికేశాడట. అయితే అది ఎవరో కాదండీ స్టార్ నటుడు ఆర్య. ప్రస్తుతం విశాల్ హీరోగా తెరకెక్కుతున్న ఎనిమి సినిమాలో ఆర్యా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అదే విధంగా పుష్ప సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రను చేయనున్నాడు. అంతేకాకుండా పుష్ప సినిమాలో స్పెషల్ పాటకు కాస్ట్‌లీ గర్ల్ ధిశాను ఓకే చేయలేదట. ఇప్పుడు ఈ పాటకు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెల చేయనుంది.

 

 

అంతేకాకుండా ఇందులో లక్కీ బ్యూటీ రష్మిక మందాన కథానాయికగా ఓ తండా యువతిగా కనిపించనుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాతో బన్నీ నార్త్ బెల్ట్‌లో అడుగు మోపనున్నాడట. మరి అక్కడ ఏరేంజ్‌లో రానిస్తాడో చూడాలి.