ద‌స‌రా కానుక‌గా విశాల్‌ `ఎనిమి` రిలీజ్..!

0
201
Arya & Vishal starrer Enemy gets a release date in October

Vishal Enemy Release Date: యాక్షన్‌ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్‌ ఆర్య కలిసి నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఎనిమి’. పది సంవత్సరాల క్రితం దర్శకులు బాలా తెరకెక్కించిన ‘వాడు–వీడు’ సినిమా తర్వాత వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తోన్న చిత్ర‌మిది. ఇది హీరో విశాల్‌ 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ మూవీ.

‘గద్దల కొండ గణేష్‌’ ఫేమ్‌ మృణాళిని రవి, మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఒక కీలక పాత్రలో నటించారు. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇప్ప‌టికే విడుద‌లైన యాక్ష‌న్ ప్యాక్డ్ టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఎనిమి చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌లో విశాల్, ఆర్య‌లు ఫిరోషియ‌స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. యాక్ష‌న్ మూవీ ల‌వ‌ర్స్‌కి ఈ సినిమా ఒక ట్రీట్ కానుంది.

Arya & Vishal starrer Enemy gets a release date in October

ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ ఆర్‌ డి రాజశేఖర్‌ ఛాయాగ్రహణం అందిస్తుండగా, లేటెస్ట్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.