Astrologer Venu Swamy comments on Akhil: అక్కినేని నాగార్జున నట వారసులుగా నాగచైతన్య అలాగే అఖిల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం జరిగింది. నాగచైతన్య కెరియర్ లో మంచి హిట్స్ అలాగే బ్లాక్ బస్టర్ మూవీస్ కూడా ఉన్నాయి. తన కెరియర్ ప్రస్తుతానికి ఒక హిట్టు రెండు ఫ్లాపులతో కొనసాగుతుంది.. ఇక అఖిల్ (Akhil Akkineni) కెరియర్ విషయానికి వస్తే మొదటి సినిమా నుండి లేటెస్ట్ ఏజెంట్ (Agent) మూవీ వరకు అనుకున్నంత స్థాయిలో హిట్ కొట్టిన సినిమా లేదు. అఖిల్ ఫ్యాన్స్ కూడా చాలా సంవత్సరాల నుంచి తన ఖాతాలో హిట్ ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్నారు.
Astrologer Venu Swamy comments on Akhil: సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్ మూవీతో అఖిల్ హిట్ కొడతారని అందరూ భావించారు. కానీ అఖిల్ (Akhil) పర్ఫామెన్స్ అలాగే తన హార్డ్ వర్క్ కి ప్రశంసలు అందగా సినిమా మాత్రం ఫ్లాప్ అవటం జరిగింది. అయితే అఖిల్ వరుస సినిమా ఫ్లాపులకు తన జాతక దోషం వల్లే జరుగుతుందని జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu Swamy) ఎప్పుడో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
జ్యోతిష్యుడు వేణు స్వామి (Astrologer Venu Swamy) మాట్లాడుతూ అఖిల్ జాతకంలో దోషాలు ఉన్నట్టు అలాగే తన జాతకంలో నాగదోషం ఉండేసరికి ఇలా జరుగుతుందని.. అంతేకాకుండా నాగ దోషం ఉన్నవారు తన సొంత సలహాలతో ఏదైనా పని చేయాలని.. అలాగే ఇతరుల సలహాలు ఎప్పుడు పాటించకూడదు అని చెప్పడం జరిగింది. దీనితోపాటు అతని సినిమాల మీద ఎవరి ప్రభావం ఉండకూడదని వేణు స్వామి అన్నారు.
వీటితోపాటు అఖిల్ (Akhil) జాతకంలో చంద్రుడు నీచంలో ఉన్నాడని.. ఇలా ఉండటం వల్ల అఖిల్ సినిమాల విషయంలో తల్లిదండ్రుల సలహాలు పనికిరావని చెప్పారు.. ఇవన్నీ జాతకాలకు సంబంధించిన అంశాల తప్ప తన అభిప్రాయం కాదు అంటూ కామెంట్ చేయడం కూడా జరిగింది. సమంత నాగచైతన్య పెళ్లయిన తర్వాత వాళ్లు ఇద్దరూ విడిపోతారని ముందే చెప్పిన వేణు స్వామి(Astrologer Venu Swamy).. ఆ తర్వాత పాపులర్ అవటం జరిగింది.. సినీ సెలబ్రిటీసే కాకుండా చాలామంది వేణు స్వామి సమక్షంలో కొన్ని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. కానీ ప్రస్తుతం వేణు స్వామి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..