ప్రముఖులు అలాగే సినీ సెలబ్రిటీగా జ్యోతిష్యాలు చెబుతూ పేరుపొందిన వేణుస్వామి (Astrologer Venuswamy) మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఈసారి ఏకంగా ప్రభాస్ (Prabhas),కృతిసనన్ హీరో హీరోయిన్ గా నటించిన ఆదిపురుష్ (Adipurush) సినిమాపై షాకింగ్ కామెంట్ చేయడం జరిగింది. ఇదే ఆదిపురుష్ ఫస్ట్ రివ్యూ అంటూ వేణుస్వామి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ముందే జోష్యం చెప్పడం జరిగింది.
అసలు విషయానికి వెళ్తే, ఓం రావత్ దర్శకత్వంలో దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమా ఆదిపురుష్(Adipurush). ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్. రీసెంట్ గా విడుదలైన ఆదిపురుష్ సినిమా ట్రైలర్ తో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి (Astrologer Venuswamy) , ఆదిపురుష్ (Adipurush) మూవీ యావరేజ్‌గా నిలిచిపోనుందని షాకింగ్ కామెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కారణాలు కూడా జ్యోతిష్యుడు వేణుస్వామి వివరించారు.
నేషనల్ స్టార్ ప్రభాస్ జాతకరిత్యా ఆదిపురుష్ సినిమా అందరూ అనుకున్నంత స్థాయిలో ఆడదు అంటూ.. అలాగే సినిమా యావరేజ్ గా నిలుస్తుంది అంటూ.. బాహుబలి స్థాయిలో హిట్ అవుతుందని ఊహించుకొని సినిమాకు వెళ్లొద్దు అంటూ కామెంట్ చేయడం జరిగింది.. అలాగే ఆదిపురుష్ మూవీ త్రీడీలో తెరకెక్కినా పిల్లలు యాక్సెప్ట్ చేసినంత మాత్రాన సూపర్ హిట్ కాదని ఆయన కామెంట్లు చేశారు.
వీటితోపాటు ప్రభాస్ పేరు చెబితే అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కావని.. వాటికి నిదర్శనంగా సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఏమయ్యాయి అంటూ కామెంట్స్ చేశారు.. ప్రభాస్ 150 కోట్ల తీసుకోవడం తన వ్యక్తిగత విషయం అని.. బాహుబలి సిరీస్ తర్వాత వచ్చిన ఏ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదని అందుకు ప్రభాస్ జాతకమే కారణమంటూ చెప్పుకోవచ్చారు.
అలాగే సమంత హీరోయిన్గా చేసిన శాకుంతలం సినిమా మీద కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇదే సినిమాని రాజమౌళి దర్శకత్వం వహించినట్లయితే ఆస్కార్ నామినేషన్ లో ఉండేదని.. రాజమౌళికి సినిమాని ప్రమోషన్ చేయటంలో తనకు సాటి ఎవరూ రారని.. పది పైసలు పెట్టిన దాన్ని వంద రూపాయిలకు కన్వర్ట్ చేసే శక్తి రాజమౌళికి ఉంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహించే ఏ సినిమా అయినా సంచలనాలు సృష్టిస్తుందంటూ అందుకు తన జాతకమే కారణమని చెప్పుకోవచ్చారు.

తారకరత్న మరణాన్ని ముందుగానే ఊహించాలంటూ.. 2026 కల్లా ఒక హీరో ఆరోగ్యపరంగా ఇబ్బంది పడతారని అలాగే మరొక హీరో మరణిస్తారని జాతకం చెప్పారు. ఇప్పుడు ప్రభాస్ మీద చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఇవి ఎంతవరకు నిజం అవుతాయి అనే విషయం సినిమా విడుదలైన తర్వాత అర్థమవుతుంది.
Web Title: Astrologer Venuswamy Shocking Comments On Prabhas Adipurush movie Details, Venu Swamy, Prabhas , Astrologer Venuswamy , Prabhas Adipurush Movie, Venuswamy Prabhas, Prabhas Horoscope , Taraka Ratna, Shaakuntalam, Rajamouli