ఫిబ్రవరి నుంచి ‘ఆహా’ వరల్డ్‌ ప్రీమియర్‌లో ‘అతడే శ్రీమన్నారాయణ’

259
Athade Srimannarayana releasing on Aha at February 26

క్రాక్‌, సూపర్‌ఓవర్‌, మెయిల్ వంటి వైవిధ్యమైన చిత్రాలతో 2021లో అమేజింగ్‌గా స్టార్ట్‌ చేసిన తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’.. అదే ప్రమాణాలను పాటిస్తూ మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్షకులకు అందిస్తూ మరింత ఎక్కవ వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది ‘ఆహా’. అందులో భాగంగా నారింజ మిఠాయి, మిడ్‌నైట్‌ మర్డర్స్‌, మాయనది చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.

ఈ క్రమంలోనే ప్రేక్షకాదరణ పొందిన చిత్రం ‘అతడే శ్రీమన్నారాయణ’ సినిమాను ఫిబ్రవరి 26న నుంచి ప్రసారం చేస్తూ ఈ వారాంతాన్ని అడ్వెంచరస్‌గా మార్చింది ఆహా. అద్బుతమైన విజువల్‌ టెక్నిక్స్‌తో అతడే శ్రీమన్నారాయణ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌, ఫాంటసీ, డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది.

అమరావతి అనే కాల్పనిక నగరంలో నిధి అన్వేషణ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ నిధి కోసం రెండు వేర్వేరు గ్యాంగులు పోటీపడుతున్నప్పుడు మన హీరో శ్రీమన్నారాయణ ఏం చేశాడనేదే సినిమా కథాంశం. అతి కొద్ది సమయంలోనే తెలుగు ఎంటర్‌టైన్మెంట్‌ ప్రపంచంలో ఆహా తనదైన గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు ప్రేక్షకులు ఎంతో అభిమానించే సూపర్‌స్టార్స్‌ నటించిన క్లాసిక్‌ సినిమాల కలెక్షన్స్‌తోపాటు ఒరిజినల్స్ కలెక్షన్స్‌ ఆహా సొంతం.