Rakshit shetty Athade Srimannarayana Telugu Trailer Talk
Rakshit shetty Athade Srimannarayana Telugu Trailer Talk

(Rakshit shetty Athade Srimannarayana Telugu Trailer Talk) కన్నడంతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతోన్న ‘అతడే శ్రీమన్నారాయణ’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అయితే ఈ చిత్ర ప్రచారంలో భాగంగా గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. తెలుగు ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా రిలీజ్ చేశారు. తమిళంలో ధనుష్, మలయాళంలో నివిన్ పాల్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్విట్టర్ ద్వారా ట్రైలర్‌ను ప్రేక్షకులతో పంచుకున్న నాని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

తాజాగా రిలీజైన ట్రైలర్ ఆకట్టుకుంది. శ్రీమన్నారాయణ దారి తప్పిన పోలీస్ కథనా? అన్న సందేహం కలిగించేలా ట్రైలర్ లో చాలా సస్పెన్స్ ని మెయింటెయిన్ చేశారు. రక్షిత్ లో ఎనర్జీ మైమరిపించింది. ఒక నిధిని దారి మళ్లించారు. అందుకు కారకుడు శ్రీమన్నారాయణేనా? లేదూ దారి తప్పిన నిధిని వెతుక్కుంటూ వెళ్లిన ఖాకీ శ్రీమన్నారాయణా? అన్నది సస్పెన్స్. పోలీసాఫీసర్ గెటప్ లో రక్షిత్ బావున్నాడు. డార్క్ గ్లాసెస్ పెట్టుకుని ఖాకీ లో క్రౌర్యం ఉన్న కుర్రాడిగా ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. అతడి ఆహార్యంలో ఈజ్ బావుంది. జనవరి 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. నిధి.. లూటీ అంటూ ట్రైలర్ తో బాగానే వేడెక్కించారు. రెండు తుపాకుల్ని గిరగిరా తిప్పేస్తూ రక్షిత్ స్టైలిష్ గా బాగానే చేశాడు. గెటప్పుల్ని బట్టి ఇది 90ల నాటి కథతోనే తెరకెక్కుతోందని అర్థమవుతోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక ఫిక్షనల్ టౌన్‌ను క్రియేట్ చేశారు. సెట్ వర్క్ అదిరిపోయింది. పాత కౌబోయ్ సినిమాల్లో ఉన్నట్టుంది. అంతేకాదు, హీరో మేనరిజం, పిక్చరైజేషన్ అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

కన్నడ నటుడు రక్షిత్ శెట్టి హీరోగా నటించిన చిత్రం ‘అతడే శ్రీమన్నారాయణ’. షాన్వి శ్రీవాస్తవ, బాలాజి మనోహర్, అచ్యుత కుమార్, ప్రమోద్ శెట్టి, మధుసూధన్ రావు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సచిన్ దర్శకత్వం వహించారు. పుష్కర మల్లికార్జునయ్య నిర్మాత. అజనీష్ లోక్‌నాథ్, చరణ్ రాజ్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ని జనుఅరీ 1 న ప్రజల ముందుకు వస్తుంది..