Atithi Devo Bhava Telugu Review |
|
నటీనటులు: | ఆది సాయి కుమార్, నువేక్ష, రోహిణి, సప్తగిరి తదితరులు |
రేటింగ్ | 2/5 |
దర్శకత్వం : | పొలిమేర నాగేశ్వర్ |
నిర్మాత: | రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల |
సంగీత దర్శకుడు | శేఖర్ చంద్ర |
ఆది సాయి కుమార్ హిట్ అలాగే ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. విభిన్నమైన కథలతో ప్రాధాన్యతను నిరూపించుకోవాలని ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాడు. ఆది సాయి కుమార్ హీరోగా, నువేక్ష హీరోయిన్గా పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతిధి దేవోభవ’. ఈ సినిమా ఈ రోజు విడుదల చేయడం జరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ:
అభయ్ (ఆది)కి చిన్నప్పటి నుంచి ఫోబియా ఉంది. అతను కేవలం కొన్ని నిమిషాలు ఒంటరిగా ఉంటే అతను ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఫోబియా వలన. కాబట్టి, అతని తల్లి (రోహిణి) అతన్ని ఎప్పుడూ ఒంటరిగా వదలదు. అలాంటి వ్యక్తి వైశాలి (నువేక్ష) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమె తనను అర్థం చేసుకోలేకపోవచ్చు కాబట్టి అతను తన ఫోబియా గురించి ఆమెకు చెప్పడానికి కూడా భయపడతాడు. మరి చివరకు అభయ్ ఆమెకు అసలు నిజం చెప్పాడా? లేదా? వైశాలితో అతనికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనేది ప్రధాన కథాంశం.
ప్లస్ పాయింట్స్ :
తెలుగు చిత్రసీమలో ఒకప్పుడు ఫోబియా ఉన్న కథానాయకుడితో కథలు కథనాలు వచ్చేవి. ఈ మధ్య కాలంలో ట్రెండ్ తగ్గిపోయింది. ఆది సాయికుమార్ ‘అతిథి దేవో భవ’ కూడా ఇదే నేపథ్యాన్ని అనుసరిస్తుంది. ‘అతిథి దేవో భవ’లో కథానాయకుడి పేరు అభయ్, భయం లేనివాడు. కానీ అతనికి మోనోఫోబియా ఉంది, ఒంటరిగా ఉండాలనే భయం.
కొత్తగా ట్రై చేసిన ఆది సాయి కుమార్ కూడా తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ వేరియేషన్స్ లో ఫ్రెష్ గా కనిపించాడు. ఇక హీరోయిన్ గా నటించిన నువేక్ష చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన నటనతోనూ బాగా ఆకట్టుకుంది. అలాగే తల్లిగా నటించిన రోహిణి నటన, మరో కీలక పాత్రలో నటించిన సప్తగిరి నటన చాలా బాగుంది. మిగిలిన నటులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్ :
ఈ ఫోబియా హీరోకి, అతని గర్ల్‌ఫ్రెండ్‌కి మధ్య ఎలా అపార్థాన్ని సృష్టిస్తుంది అనేదే గొడవకు ఆధారం. అలాంటి కథాంశానికి ఊహాజనిత కథనం మరియు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అవసరం. కానీ ఈ సినిమాలో దర్శకుడు ఆ స్క్రీన్ ప్లే చూపించడంలో విఫలమయ్యాడనే చెప్పవచ్చు.
పాత్రలు పరిచయానికి సమయం తీసుకున్నారనుకున్నా.. ఫస్ట్ హాఫ్ స్లోగా బోరింగ్ గా సాగుతుంది. కదా కథాంశంలో ఎక్కడా కొత్తదనం లేకుండా.. అలాగే బోరింగ్ కొట్టే సన్నివేశాలు.. దర్శకుడు అక్కడక్కడా కామెడీ సన్నివేశాల్ని ట్రై చేసిన అవి ఎంత మాత్రం సినిమాకి ఉపయోగ పడలేదు. దీనికి తోడు ప్రతి పాత్ర ఒకే ఎమోషన్ తో ఎలాంటి బలమైన సంఘర్షణ లేకుండా చాలా నిస్సహాయతతోటి సాగుతాయి.
దర్శకుడు తీసుకున్న కథకి ఇంకొంచెం వర్క్ చేసినట్లయితే సినిమాని మరింత బాగా చూపించే అవకాశం ఉంది కానీ స్క్రీన్ ప్లే మీద సినిమా చూస్తే అర్థమవుతుంది. అనవసరమైన సన్నివేశాలతో సినిమాని బాగా ల్యాగ్ చేశాడు. టెక్నీషియన్స్‌లో శేఖర్ చంద్ర తన పాటలతో మెరుగ్గా స్కోర్ చేశాడు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు.
తీర్పు :
రెండు గంటల పాటు మన దృష్టిని ఎలా పట్టుకోవాలనే దానిపై రచయితలు తమ మెదడును పెట్టలేదని చాలా సన్నివేశాలు రుజువు చేస్తున్నాయి. పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే, ఆది సాయి కుమార్ తన పాత్రకు చాలా బెటర్ గా చేశాడు. స్లో నేరేషన్, బోరింగ్ ట్రీట్మెంట్, లాజిక్ లేని స్క్రీన్ ప్లే.. అలాగే సప్తగిరి కామెడీ మిస్ అవ్వడం.. సినిమా క్లైమాక్స్ లేకపోవడం..వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. దాంతో ఈ సినిమా అందర్నీ ఆకట్టుకోలేకపోయింది.