పార్కులో హీరోయిన్‌పై దాడి..!

0
373
samyuktha hegde
samyuktha hegde

అనుకోని ప‌రిణామాలు ఒక్కోసారి షాక్‌కు గురి చేస్తుంటాయి. పబ్లిక్‌‌గానే టాప్ తీసి చూపిస్తూ ఫైర్ అయింది హీరోయిన్ సంయుక్త హెగ్డే (Samyuktha Hegde). ఈ మేరకు తనపై జరిగిన దాడిపై సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది. ఏదో కాసేపు వర్కవుట్స్ చేసుకుందామని పార్క్‌కి వెళితే అక్కడ ఊహించని షాక్ తగిలింది. కొంతమంది ఆమెపై దాడి చేయడం కలకలం సృష్టిస్తోంది.

నాగార్జున‌తో మ‌న్మ‌థుడు 2, నిఖిల్‌తో కిర్రాక్ పార్టీ వంటి చిత్రాల‌తో పాటు ప‌లు త‌మిళ చిత్రాల్లో న‌టించిన హీరోయిన్ సంయుక్త హ‌గ్డే. ఈమె బెంగ‌ళూరులోని ఓ పార్కులో స్పోర్ట్స్ బ్రా వేసుకుని పార్కులో డాన్స్‌, వ‌ర్క‌వుట్స్ చేయ‌డానికి కొంత మంది స్నేహితులతో క‌లిసి చేరుకున్నారు. ఆ స‌మయంలో అక్క‌డున్న‌న క‌వితా రెడ్డి మ‌హిళ సంయుక్త‌పై దాడి చేసింది. స‌దరు దాడి చేసిన మ‌హిళకు అక్క‌డే ఉన్న కొంత మంది ప‌బ్లిక్ కూడా సపోర్ట్ చేశారు. ప‌బ్లిక్‌లో స్పోర్ట్స్ బ్రా వేసుకుని తిర‌గ‌డంతో పాటు మీ లాంటి నటులంతా డ్ర‌గ్స్ వాడతారంటూ ఆమెపై దాడి చేశారు.

దీంతో కోపంతో ఊగిపోయిన సంయుక్త ఓ సెల్ఫీ వీడియోలో అసలు విషయం చెబుతూ ఫైర్ అయింది. తాను వర్కవుట్ చేయడానికి వేసుకున్న లో- దుస్తులను పబ్లిక్‌‌గానే టాప్ తీసి చూపిస్తూ రెచ్చిపోయింది. దాడి చేసిన మహిళతో పాటు ఆమెకు సపోర్ట్ చేసిన వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకే కొందరు ఈ ప్రయత్నం చేస్తున్నారంటూ ఆవేదన చెందింది. దీంతో ఆమె పోస్ట్ చేసిన ఈ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here