Avengers Endgame, Telugu Movie Review, Hollywood Latest News
Avengers Endgame, Telugu Movie Review, Hollywood Latest News

విడుదల తేదీ : ఏప్రిల్ 26, 2019
రేటింగ్ : 3.75/5
నటీనటులు : రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, జోష్ బ్రోలిన్, క్రిస్ హెమ్స్‌వర్త్, క్రిస్‌ పాట్‌, క్రిస్‌ ఇవాన్స్
దర్శకత్వం : ఆంథోనీ రుస్సో, జో రుస్సో
నిర్మాత : కెవిన్ ఫీగే మరియు స్టాన్ లీ
సంగీతం : అలాన్ సిల్వెస్ట్రీ
సినిమాటోగ్రఫర్ : ట్రెంట్ ఓపాలోచ్
ఎడిటర్ : జెఫ్రీ ఫోర్డ్

అవెంజర్స్ ప్రపంచవ్యాప్తంగా అసాధారణ క్రేజ్ దక్కించుకుని ఆ క్రేజ్ కి పదింతల వసూళ్లు రాబట్టిన అవెంజర్స్ ప్రాంచైజీ నుంచి చివరి పార్ట్ గా రిలీజ్ అయ్యింది ఎండ్ గేమ్ .అకాశాన్ని తాకే అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా భారీ రెవిన్యూ టార్గెట్ తో థియేటర్లలోకి దూసుకొచ్చిన ఎవెంజర్స్ అలరించారా లేదా జస్ట్ ఓకే అనిపించారా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ:

గత పార్ట్ లో 6 మహిమాన్విత మణులను దక్కించుకున్న థానోస్ ఒక్క చిటికెలో సగం ప్రపంచాన్ని అంతం చేస్తాడు.అయితే ఈలోగా అతని ఆచూకీ తెలుసుకున్న అవెంజర్స్ మెరుపుదాడి చేసి థానోస్ ను అంతమొందిస్తారు.కానీ అతని దగ్గర ఉండాల్సిన మణులు మాత్రం కనిపించవు.5 సంవత్సరాల తర్వాత టైమ్ మెషీను ను తయారు చేసిన అవెంజర్స్,కాలంలో వెనక్కి పయనించి 6 మణులను ఎలా సొంతం చేసుకున్నారు..?బతికొచ్చిన ధానోస్ ని ఎలా అంతం చేశారు..? చనిపోయిన మనుషులందరినీ మళ్లీ ఎలా తిరిగి కాపాడారు అన్నది సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే.

నటీనటులు:

ఐరన్ మ్యాన్ గా అన్ని పార్ట్ ల్లో ఆకట్టుకున్న రాబర్ట్ డోనీ జూనియర్ ఈ పార్ట్ లో కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కించుకున్నాడు.దానికి తగ్గట్టు గానే ప్రేక్షకులను నవ్విస్తూ చివరికి ఏడిపించాడు కూడా.అతని ఎమోషనల్ కనెక్ట్ సినిమాకి మంచి వెయిట్ తీసుకొచ్చింది.కెప్టెన్ అమెరికాగా అలరిస్తూ వస్తున్న క్రిస్ ఎలెన్స్ కూడా ఎండ్ గేమ్ కి ప్రధాన బలంగా నిలిచాడు.కెప్టెన్ అమెరికా,ఐరన్ మ్యాన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు,వాళ్లు మణిని దక్కించుకునే సన్నివేశాలు ఉత్కంఠగా నడిచాయి.

హల్క్ గా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మార్క్ రాఫెల్లో పేల్చిన పంచెస్ బావున్నాయి.క్రిస్ హెమ్స్ వర్త్ పోషించిన థోర్ క్యారెక్టర్ కూడా ఎంటర్ టైనింగ్ గా సాగింది.అతని సామ్రాజ్యమైన అస్గర్డ్ లో సన్నివేశాలు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి.బ్లాక్ విడో,యాంట్ మ్యాన్, నెబ్యులా, వొంగ్,రాకెట్ లు గత పార్ట్ లో మాదిరిగానే ఎండ్ గేమ్ లో ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.దగ్గుబాటి రానా వాయిస్ ఓవర్ అందించిన థానోస్ క్యారెక్టర్ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది.రానా వాయిస్ వలన ఆ క్యారెక్టర్ తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది.

టెక్నీషియన్స్:

అవెంజర్స్ అనే సూపర్ హీరోస్ క్రియేషన్ తో అపరకుబేరులుగా మారిన మార్వెల్ స్టూడియో అధినేతనలు ప్రేక్షకుల అంచనాలు అందుకునేలా అన్ కాంప్రమైజ్డ్ గా 400 మిలియన్ డాలర్లతో ఎండ్ గేమ్ ని తెరకెక్కించారు.అయితే 3 గంటల నిడివి ఉన్న ఈ సినిమాను ఎక్కడా బోర్ కొట్టకుండా కామెడీ ఎమోషన్ లకు,అబ్బురపరిచే విజువల్ గ్రాండియర్ ను జోడిస్తూ తెరకెక్కించారు డైరెక్టర్ ఆంథోనీ రుస్సో,జోయ్ రుస్సో.

ఎవెంజర్స్ గత పార్ట్ చూడనివాళ్లకు ఇది కాస్త కన్ ఫ్యూజింగ్ గా అనిపించవచ్చు ఏమోగానీ..అల్రెడీ ఎవెంజర్స్ ఫ్యాన్స్ గా మారిన వాళ్లకు మాత్రం ఒక పండగలా అనిపిస్తుంది ఈ సినిమా. ట్రెంట్ ఓపలెజ్ సినిమాటోగ్రఫీ అవెంజర్స్ ఎండ్ గేమ్ కి కొండంత అండగా నిలిచింది.పేపర్ పై ఉన్న అనేక అనేక లేయర్స్ ని డిఫరెంట్ లైటింగ్ స్కీమ్స్ తో చాలా క్లియర్ గా తెరకెక్కించాడు.త్రీడీ ఎఫెక్ట్ గా ఆ సన్నివేశాలు అబ్బురపరిచేలా ఎలివేట్ అయ్యాయి.అలెన్ సిల్వెస్ట్రీ నేపథ్య సంగీతం బావుంది.జెఫ్రీ ఫోర్ట్ ఎడిటింగ్ పనితనం సినిమాకు ప్లస్ అయ్యింది.

ఫైనల్ గా:

సునామీ లాంటి క్రేజ్ తో మూడు రోజుల ముందు నుంచే ప్రపంచాన్నిషేక్ చే్స్తున్న అవెంజర్స్:ఎండ్ గేమ్ అంచనాలను అందుకునే రేంజ్ లోనే నిలిచింది.నిడివి ఎక్కువైనా కూడా బోర్ కొట్టకుండా నడిపిన విధానం వల్ల పెట్టుకున్న కలెక్షన్ల టార్గెట్ ఈజీగా రీచ్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చెయ్యడం అనే మార్వెల్ స్టూడియోస్ స్ట్రాటజీ ఎవెంజర్స్ ఎండ్ గేమ్ రేంజ్ ని మరింత పెంచింది.ఇండియన్ బాక్సాఫీస్ లో కూడా గత హాలీవుడ్ సినిమాల రికార్డ్స్ ను అవెంజర్స్: ఎండ్ గేమ్ తిరగరాయడం ఖాయం.