Avika Gor roped in after Tamannah walks out of 'Raju Gari Gadhi 3'
Avika Gor roped in after Tamannah walks out of 'Raju Gari Gadhi 3'

రాజుగారిగది…ఓంకార్ తీసిన ఈ సినిమా సూపర్ హిట్ హారర్ సస్పెన్స్ డ్రామా…ఈ సినిమా సీక్వెల్ గా వచ్చిన రాజుగారిగది-2 సేమ్ ఫార్మాట్ లోనే వచ్చిన రిజల్ట్ మాత్రం తగ్గింది.అయినా కూడా ఓంకార్ మళ్ళీ అదే టైటిల్ తో రాజుగారిగది-3 స్టార్ట్ చేసాడు.కానీ ఈ గదిలో నటించేందుకు ఈ హీరోయిన్ కూడా ముందుకు రావట్లేదు.

[INSERT_ELEMENTOR id=”3574″]

ముందుగా సమంతకు కథ వినిపిస్తే నో చెప్పింది.తమన్నా ఎస్ చెప్పి ముహుర్తానికి కూడా వచ్చింది.కారణాలు తెలియదు గానీ షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వకుండానే గదిలోంచి బయటికి వచ్చింది.తాప్సి అయితే బెటర్ అని వెళ్లారు,కానీ ఆమె రొటీన్ కథలు చెయ్యట్లేదు.పైగా గేమ్ ఓవర్ ఇచ్చిన షాక్ కి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే ఆలోచనలో ఉంది.కాజల్ అయితే కుర్ర హీరోలు,సీనియర్ హీరోలు అనే డిఫరెన్స్ లేకుండా,ఎనీ లాంగ్వేజ్ అయినా ఒక అంటూ వరుసగా సినిమాలు చేస్తుంది.సో,ఆమె కూడా నో తప్ప ఇంకేం చెప్పలేదు.

[INSERT_ELEMENTOR id=”3574″]

దాంతో ఖాళీగా ఉన్న అవికాగోర్ ని హీరోయిన్ గా తీసుకున్నారు అని టాక్.కానీ ఆమెకి సోలో గా సినిమాని నడిపించే సత్తా ఉందా అంటే లేదు అనే మాటే వినిపిస్తుంది.అయినా ఓంకార్ ధైర్యం చేసి ఆమెని తీసుకున్నాడు.ఇది ఒక పక్క అవికా కి,మరొక పక్క ఓంకార్ కి ఇద్దరికి కూడా టెస్ట్ అనే చెప్పుకోవాలి.

[INSERT_ELEMENTOR id=”3574″]