ayyappanum koshiyum remake kichcha sudeep to play opposite pawan kalyan

Pawan Kalyan PSPK30: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ‘వకీల్ సాబ్’ సినిమాతో మళ్లీ జోరు పెంచిన విషయం తెలిసిందే. ఆయన ఖాతాలో ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్నాయి. వీటిలో మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుం కొషియుమ్’ PSPK30 ని ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. డైరెక్టర్ సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించనున్నారు.

ఈ సినిమాలు ఇద్దరు హీరోలుంటారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, బిజు మీనన్ నటించారు. తెలుగులో పవన్ కళ్యాణ్‌తో పాటు నటించే మరో హీరోను ఇంకా ఖరారు చేయలేదు. అయితే ఈ సినిమా లో రవితేజ పేరు బలంగా వినిపించింది.  ఇప్పుడు మరో నటుడి పేరు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆ నటుడు ఎవరో కాదు.. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్.

సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.  మొన్నామధ్య పవన్ కళ్యాణ్‌ను సుదీప్ కలిశారు. అయితే, అప్పుడు పవన్‌ను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారని ప్రకటించారు. కానీ, ఆ కలవడానికి కారణం ఈ సినిమానే అని ప్రెజెంట్ టాక్. మరి ఈ రూమర్‌లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.