రామ్‌తో జెనీలియా ఫన్ వీడియో వైర‌ల్

651
Ayyo Ayyo Ayyo Danayya Song | Genelia Fun Video with Ram Pothineni
Ayyo Ayyo Ayyo Danayya Song | Genelia Fun Video with Ram Pothineni

హీరో రామ్ పోతినేని, జెనీలియా ప్ర‌ధాన పాత్ర‌లుగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ‘రెడీ’ సినిమా వచ్చిన విష‌యం తెలిసిందే. 2008 లో వచ్చిన ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఈ చిత్రం తరువాత రామ్, జెనీలియా మంచి స్నేహితులుగా మారారు.

 

అప్ప‌టి నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య మంచి సాన్నిహిత్యం నెల‌కొంది. తాజాగా వీరిద్దరూ క‌లిసి తెగ సంద‌డి చేసారు. అందుకు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో జెనీలియా షేర్ చేసింది. ఇటీవ‌ల స్కేటింగ్ చేస్తూ గాయ‌ప‌డ్డ జెనీలియా చేతి క‌ట్టుతోనే రామ్‌తో క‌లిసి ఫ‌న్ చేసింది.

 

 

ఇద్ద‌రు క‌లిసి ఇంస్టా రీల్ చేద్దామ‌నుకుంటే అది ఏదో అయింది. రెడీ మూవీలోని ‘అయ్యో అయ్యో అయ్యో దానయ్య.. మీ కుర్రాళ్లంతా బకరాగాల్లయ్యా’ అనే పాటకు జెనీలియా డాన్స్ చేస్తూ మరోసారి కిందపడే అంత పని చేసింది. ప్రస్తుతం ఈ  వీడియో వైరల్ గా మారింది.