Baahubali Star Prabhas Shocking Remuneration For Adipurush Movie

జయంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ (Prabhas) తొలి సినిమాతో మంచి సక్సెస్ నే అందుకున్నారు. ఆ తరువాత ఆయన నటించిన మూడవ సినిమా వర్షం అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకుని హీరోగా ప్రభాస్ (Prabhas) కు మంచి కమర్షియల్ సక్సెస్ ని అందించింది. బాహుబలి చిత్రం తరువాత ప్యాన్ ఇండియా హీరోగా అవతరించిన ప్రభాస్ రెమ్యునరేషన్ (Prabhas Remuneration) ఇప్పుడు రూ. 100 కోట్ల.

రాజమౌళి తీసిన బాహుబలి రెండు భాగాలు ఎంతటి గొప్ప విజయాలు అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాటితో ఏకంగా జాతీయస్థాయిలోనే కాక, అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రభాస్ భారీ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ని దక్కించుకున్నారు. టాలీవుడ్‌లో ఏ తెలుగు హీరోకి లేని రెమ్యునరేషన్ ఇదే కాగా.. బాలీవుడ్ హీరోలు అక్షయ్, షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్‌ల మించి రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్‌కి చేర్చింది.

ఇక ప్రస్తుతం రాధేశ్యామ్ మూవీలో నటిస్తున్న ప్రభాస్, దాని అనంతరం నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించనున్న సినిమాతో పాటు, బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఎంతో భారీగా తెరకెక్కనున్న ఆదిపురుష్ సినిమాలో కూడా నటించనున్నారు. ఇప్పుడు ‘ఆది పురుష్’ సినిమాను గుల్షన్ కుమార్, టి-సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో భూషణ్ కుమార్ నిర్మిస్తుండగా.. మొత్తం బడ్జెట్ వెయ్యి కోట్లు కాగా.. ఇందులో ప్రభాస్ రెమ్యునరేషన్ రూ. 100 కోట్లు అని తాజా అప్డేట్.