Baahubali vs PS fans fight: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Baahubali vs PS fans fight: ఇండియన్ సినిమా బాహుబలికి ముందు, బాహుబలి తరువాత అని మాట్లాడుకునేలా చేసింది. నాన్-బాహుబలి, నాన్-SSR రికార్డులను చెప్పుకునేలా చేసింది. సౌత్ చిత్రాలకు పాన్ ఇండియా దారి చూపింది. అయితే ఇప్పుడు కోలీవుడ్ సినీ అభిమానులు బాహుబలి సినిమాను తక్కువ చేస్తూ పోస్టులు పెట్టడం ఫ్యాన్ వార్ కు కారణమైంది.
Baahubali vs PS fans fight: ‘బాహుబలి 2’ సినిమా ఏప్రిల్ 28 నాటికి ఆరేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో #6YrsForIndianIHBaahubali2 హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేసారు. ఇదే రోజున మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్ 2′(Ponniyin Selvan 2) మూవీ రిలీజ్ అయింది. అయితే ఇది ‘బాహుబలి 2’ (Baahubali2) కంటే చాలా గొప్ప సినిమా అంటూ తమిళ తంబీలు ట్వీట్లు పెడుతున్నారు. కొన్ని వెరిఫైడ్ అకౌంట్స్ నుంచి ఇలాంటి ట్వీట్స్ రావడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ ఎదురుదాడి చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల సినీ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ జరిగింది.
నిజానికి ‘పొన్నియన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1) సినిమా సమయంలోనే తమిళులు ‘బాహుబలి’ (Baahubali2) మరియు రాజమౌళిపై అక్కసు వెళ్లగక్కారు. ‘PS 1’ చిత్రానికి తెలుగులో పెద్దగా ఆదరణ దక్కకపోవడంతో.. మన చిత్రాలపై నెగటివ్ కామెంట్స్ చేసారు. ఇప్పుడు ‘PS 2’ రిలీజ్ నేపథ్యంలో మరోసారి నెగెటివ్ ప్రచారానికి తెరలేపారు.
‘బాహుబలి’ (Baahubali) కంటే ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan) 100 రెట్లు బెటర్ అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం స్టార్ట్ చేసారు. బాహుబలి – భల్లాలదేవ ఫోటోలకు మణిరత్నం – రాజమౌళి తలలు మార్ఫింగ్ చేసి మీమ్స్ చేస్తున్నారు. దీనికి తెలుగు ఆడియన్స్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ‘బాహుబలి 2’ వచ్చి ఆరేళ్లైనా ఆ రికార్డులు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయని, పొన్నియన్ సెల్వన్ గొప్ప సినిమా అయితే ఆ రికార్డులను బద్దులుకొట్టి చూపించాలని ట్వీట్లు పెడుతున్నారు.
నిజానికి లెజండరీ దర్శకుడు మణిరత్నమే ఎన్నోసార్లు ‘బాహుబలి’ గురించి గొప్పగా మాట్లాడారు. అసలు తన డ్రీం ప్రాజెక్ట్ ను తెరకెక్కించడానికి రాజమౌళి ధైర్యం ఇచ్చాడని స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఇది మర్చిపోయి కొంతమంది అరవ ఫ్యాన్స్ విష ప్రచారం చేస్తున్నారు. తమ సినిమా గొప్పగా ఉంటే బాగుందని చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ జెలసీతో భారతీయ సినిమా ఖ్యాతిని చాటిచెప్పిన మూవీని కించపరచడం తగదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.