Baby box office Collection: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య అలాగే విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా బేబీ. ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి బాగానే ప్రమోషన్స్ చేశారు మేకర్స్. దానికి తగ్గట్టుగానే బేబీ సినిమా నుండి విడుదలైన సాంగ్స్, టీజర్ అలాగే ట్రైలర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ సినిమాపై తీసుకువచ్చింది. దీనితో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. జులై 14న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావటంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది.
Baby box office Collection: ఇక మొదటిగా చూసుకుంటే బేబీ సినిమా ప్రీమియర్స్ నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా విడుదలైన తర్వాత కూడా అన్ని ఏరియాల నుండి మంచి రెస్పాన్స్ అయితే దక్కుతుంది. ఇప్పుడు మేకర్స్ ఈ స్పందనతో థియేటర్ సంఖ్యను కూడా పెంచడం జరిగింది. దీనితో మొదటి రోజు బేబీ కలెక్షన్స్ అన్ని ఏరియాల్లో భారీగా నమోదు అయ్యాయి. బేబీ మొదటి రోజు 7.1 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసినట్టు మేకర్స్ అధికారికంగా పోస్టర్ నీ విడుదల చేయడం జరిగింది.
ఇక ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు దేవి సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. బేబీ సినిమా బిజినెస్ విషయానికి వస్తే బాక్సాఫీస్ వద్ద 8 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఆదుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీ తెలంగాణలో మొదటి రోజు 4 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే దీనితోపాటు ఓవర్సీస్ లో కూడా 80 లక్షలకు పైగా షేర్ కలక్షన్స్ వచ్చాయి. ఈ కలెక్షన్స్ ప్రకారం బేబీ సినిమా మొదటి వారంలోనే బాక్స్ ఆఫీస్ వద్ద టార్గెట్ ని కంప్లీట్ చేసి హిట్ సినిమాగా నిలుస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.

ఇక నిర్మాత SKN అంచనాల ప్రకారం ఈ సినిమా రెండో రోజు కూడా భారీ కలెక్షన్స్ ని నమోదు చేస్తున్నది ఆశిస్తున్నారు. ఆనంద్ దేవరకొండ కూడా ఈ సినిమా మంచి పేరుని తీసుకువచ్చింది దానితోపాటు తన బాక్సాఫీస్ స్టామినాను కూడా ఈ సినిమాతో పెంచుకున్నారు. మరి బేబీ సినిమా టోటల్ రన్ పూర్తయ్యలోపు ఎంత ప్రాఫిట్ సాధిస్తుందో చూడాలి.