ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న సినిమా బేబీ. సాయి రాజేష్ దస్కృతంలో వస్తున్న ఈ సినిమా ఈరోజు భారీ అంచనాల నడుమ విడుదల అవటం జరిగింది. విడుదలకు ముందే బేబీ సినిమా ట్రైలర్ అలాగే సాంగ్స్ సినిమాపై మంచి హైప్ ని తీసుకురావడం జరిగింది. సినిమా ట్రైలర్ తో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని పేరు తెచ్చుకున్న బేబీ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం పదండి.
Baby Telugu Review & Rating: 2.75/5 –నటీనటులు: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య, నాగబాబు, – దర్శకుడు : సాయి రాజేష్ నీలం – నిర్మాతలు: ఎస్.కె.ఎన్
కథ : చిన్ననాటి ఇద్దరు మిత్రుల ప్రేమ కాదు నీ స్టోరీగా మల్చుకొని దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమా తీయడం జరిగింది. ఆనంద్ దేవరకొండ అలాగే వైష్ణవి స్కూల్ ఏజ్ నుంచి ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ పెరగటంతో పాటు వాళ్ళ ప్రేమ కూడా పెరుగుతూనే ఉంటుంది. వైష్ణవిని ఆమె కంటే చాలా గొప్పగా ప్రేమిస్తాడు. ఆ తర్వాత వైష్ణవి ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతుంది. ఆనంద్ పరీక్షల తప్పడంతో ఆటో డ్రైవర్ గా మారతాడు. వైష్ణవి కాలేజీలో జాయిన్ అయిన తర్వాత తనకి విరాజ్ పరిచయం అవటం జరుగుతుంది. వీళ్ళ ముగ్గురం మధ్య జరిగిన ప్రేమ సంఘటనలు ఎలా ఉన్నాయి..? కాలేజీలో పరిచయం అయిన మధ్యలోవిరాజ్ పాత్ర ఏమిటి ? చివరకు ఆనంద్ ప్రేమలో గెలిచాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.
బలాలు:
- ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల నటన
- పాటలు, నేపథ్య సంగీతం
బలహీనతలు:
- రొటీన్ సన్నివేశాలు
- సాగదీతతో కూడిన సన్నివేశాలు
- రొటీన్ కదా
విశ్లేషణ: వైష్ణవి చైతన్య అలాగే ఆనంద్ దేవరకొండ కలిసి నటించిన ఈ బేబీ సినిమా ఈతరం ప్రేమ కథలో ఆధారంగా తీసుకొని తీయడం జరిగింది. దర్శకుడు సాయి రాజేష్ ఒకరకంగా సినిమా కథకి న్యాయం చేశారని చెప్పాలి. అలాగే ఆనంద్ దేవరకొండ అలాగే వైష్ణవి చైతన్య నటన కూడా చాలా బాగుంది ఈ సినిమాలో. ఈ తరం జనరేషన్ లో ప్రేమలో పడిన తర్వాత చిన్న చిన్న కారణాలతో వాళ్లు ఎలా విడిపోతున్నారనే సారాంశాన్ని దర్శకుడు బాగా చూపించారు. కీలక పాత్రలో నటించిన విరాజ్ అశ్విన్ తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు.
ఆనంద్ దేవరకొండకి, వైష్ణవి చైతన్యకి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా ఆనంద్ దేవరకొండ నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా ఆనంద్ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కి ఆడియన్స్ కలెక్ట్ అవటం పక్కా..తండ్రి పాత్రలో కనిపించిన నాగబాబు కూడా బాగా నటించాడు. వైవా హర్ష, లిరిష, కుసుమ, సాత్విక్ ఆనంద్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

దర్శకుడు సాయి రాజేష్ రాసుకున్న కథ ప్రకారంగా సినిమాలో చాలా ఎమోషనల్ సీన్స్ అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా దానికి ఉపయోగపడటంతో బాగానే తీయడం జరిగింది.. కానీ కొన్ని కొన్ని సన్నివేశాలలో తను రాసుకున్న స్క్రీన్ ప్లే వల్ల సినిమా చాలా నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని లవ్ సీన్స్ కూడా ల్యాగ్ అనిపిస్తాయి. మొత్తంగా రెగ్యులర్ ప్లే, స్లో నేరేషన్ వంటి అంశాలు సినిమాకి కొంతవరకు మైనస్ అయ్యాయి.
మొత్తం మీద బేబీ సినిమా ఈ తరం జనరేషన్ ని బాగానే ఆకట్టుకుంటుంది. అలాగే ప్రేమలో నేటి యువత చేసే పొరపాట్లు తాలూకు పర్యవసానాలను కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు.ఐతే, స్క్రీన్ ప్లే లో స్లో నేరేషన్ సినిమాకి మైనస్ అయ్యింది. సాయి రాజేష్ రచన – దర్శకత్వం కూడా మెప్పించాయి. ఈ వీకెండ్ లో ఒక్కసారి వెళ్లి సినిమాని చూసి రావచ్చు.