Homeసినిమా వార్తలుఆటోలతో బేబీ కోసం వినూత్న ప్రమోషన్స్..!!

ఆటోలతో బేబీ కోసం వినూత్న ప్రమోషన్స్..!!

Anand Devarakonda Baby movie: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస‌కేఎన్ నిర్మించాడు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ కదిలిస్తున్నాయి. ఇలా సినిమాకు ఇప్పుడు మంచి హైప్ ఏర్పడింది.

Anand Devarakonda Baby movie: జూలై 14న రాబోతోన్న ఈ చిత్ర ప్రమోషన్స్‌లో యూనిట్ అంతా బిజీగా ఉంది. నిర్మాత ఎస్‌కేఎన్, ఆనంద్, వైష్ణవి, విరాజ్ అశ్విన్‌లు ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నారు. టీజర్, ట్రైలర్ చూస్తే హీరో ఆనంద్ దేవరకొండ ఇందులో ఆటో డ్రైవర్‌గా కనిపిస్తున్నాడు. దీంతో బేబీ సినిమా ప్రమోషన్స్ కోసం వందల ఆటోలు కలిసి ముందుకు వచ్చాయి.

వందల ఆటోలు ఏకమై సినిమా రిలీజ్ డేట్‌ను మరోసారి ప్రకటించాయి. జూలై 14న బేబీ విడుదల కాబోతోందంటూ వరుస క్రమంలో ఆటోలను పెట్టి వినూత్నంగా ప్రమోషన్స్ చేయించారు మేకర్లు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Baby Telugu Movie Promotions in full swing
Baby Telugu Movie Promotions in full swing

Anand Devarakonda Baby movie, Vaishnavi Chaitanya, Baby Movie Release Date, Baby Telugu Movie Review, Baby Movie USA premiere

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY